Begin typing your search above and press return to search.

కొత్తా దేవుడండీ.. నాగ్ తెస్తున్నాడండీ

By:  Tupaki Desk   |   11 Jun 2016 5:25 AM GMT
కొత్తా దేవుడండీ.. నాగ్ తెస్తున్నాడండీ
X
వెంకటేశ్వర స్వామి.. శ్రీనివాసుడు.. ఏడుకొండలవాడు.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోవాలంటే కష్టమైన విషయం కానీ.. ఈ పాత్రను పోషించడం అంత సులువైన విషయమేమీ కాదు. రాముడు - కృష్ణుడు లాంటి పాత్రలకు ఎన్టీఆర్ ని మించిన నటుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య సినిమా నుంచి ఈ పాత్రలో సీనియర్ నటుడు సుమన్ ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఈ తరహా దేవుడి పాత్రల్లో సుమన్ మాత్రమే కనిపిస్తున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ కి కొత్త దేవుడు వచ్చేస్తున్నాడు. హిందీ సీరియల్స్ లో మహా విష్ణువు - కృష్ణుడు - రాముడు పాత్రల్లో ఒదిగిపోయిన సౌరభ్ రాజ్ జైన్ ను.. ఇప్పుడు తెలుగులోనూ ఈ పాత్రలో కనిపించబోతున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందనున్న భక్తిరస చిత్రంలో.. వేంకటేశ్వరుని పాత్ర చేసేందుకు సౌరభ్ జైన్ ను సంప్రదించారు నిర్మాతలు.

టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ ను హ్యాపీగా యాక్సెప్ట్ చేసేశాడు సౌరభ్ జైన్. శ్రీనివాసుడి భక్తుడైన హథీరాంజీ బాబా పాత్రలో నాగార్జున కనిపంచనుండగా.. ఆయన జీవిత చరిత్రపైనే సినిమా రూపొందనుంది. ఇప్పటివరకూ సీరియల్స్ లో అలరించిన సౌరభ్ జైన్.. ఈ సినిమాలోనూ దేవుడి పాత్రలో సక్సెస్ అయితే.. ఇక టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు క్యూ కట్టడం ఖాయమని చెప్పచ్చు.