Begin typing your search above and press return to search.

పవన్ గురువే పూరి హీరోకు కూడా...

By:  Tupaki Desk   |   16 March 2017 4:48 AM GMT
పవన్ గురువే పూరి హీరోకు కూడా...
X
టాలీవుడ్లో ఏదైనా పెద్ద ఫ్యామిలీకి చెందిన కుర్రాడు హీరో కావాలంటే.. శిక్షణ కోసం వైజాగ్ సత్యానంద్ వైపే చూస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు శిక్షణ ఇవ్వడంతో మొదలుపెట్టి మహేష్ బాబు.. ప్రభాస్.. రవితేజ.. ఇలా ఎందరో స్టార్లను తీర్చిదిద్దిన ఘనత ఆయనది. ఆయన దగ్గర దాదాపు వంద మంది నటీనటులు శిక్షణ తీసుకోవడం విశేషం. స్టార్ మేకర్‌ గా గుర్తింపు తెచ్చుకున్న సత్యానంద్.. లేటెస్టుగా ‘రోగ్’ హీరో ఇషాన్ ను కూడా తీర్చిదిద్దాడు. ‘మహాత్మ’ నిర్మాత సి.ఆర్.మనోహర్ తమ్ముడైన ఇషాన్.. హీరో కావడానికి కొన్నేళ్ల ముందు నుంచే సన్నాహాల్లో ఉన్నాడు. తెలుగులో చాలామంది హీరోల్ని తీర్చిదిద్దిన సత్యానంద్ దగ్గరే పట్టుబట్టి మరీ అతడికి శిక్షణ ఇప్పించారట.

‘రోగ్’ ఆడియో వేడుకకు కూడా సత్యానంద్ వచ్చి తన శిష్యుడిని ఆశీర్వదించాడు. సత్యానంద్ దగ్గర మూడు నెలలు శిక్షణ తీసుకున్నాక ఇషాన్.. తన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో వెనక్కి వెళ్లిపోయాడట. ఐతే కొన్ని రోజుల తర్వాత సత్యానంద్ ఫోన్ చేసి ఇషాన్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి అవసరమని.. అతడి దగ్గర టాలెంట్ ఉందని చెప్పి వెనక్కి పిలిపించుకున్నాడట. ఈ విషయాన్ని మనోహర్ తెలిపాడు. ఇక ‘రోగ్’ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇషాన్ యాక్టింగ్ స్కిల్స్ గురించి గొప్పగా చెప్పేశాడు. అతను కాబోయే స్టార్ అన్నాడు. 20 ఏళ్లు ఉంటాడని.. 50 సినిమాలు చేస్తాడని.. ఇంకా చాలానే చెప్పాడు తన హీరో గురించి. మరి పవన్ గురువు నుంచి శిక్షణ అందుకున్న ఇషాన్ కు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/