Begin typing your search above and press return to search.

అవును.. త్రిష పక్కన అతనే హీరో

By:  Tupaki Desk   |   31 Dec 2015 4:33 PM IST
అవును.. త్రిష పక్కన అతనే హీరో
X
‘సత్యం’ సినిమాతో కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన రాజేష్.. అడపా దడపా సినిమాలు చేస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్నాడు తప్పితే చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు మాత్రం చేయట్లేదు. కమెడియన్‌ గా నెక్స్ట్ స్టేజ్ కు చేరుకోవడానికే చాలా కష్టపడుతున్న రాజేష్.. హీరో అవుతున్నాడంటూ కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. అది కూడా త్రిష పక్కన అతను హీరోగా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే చాలామందికి ఇది నమ్మశక్యంగా అనిపించలేదు. ‘నాయకి’ సినిమాలో అతను కీలక పాత్ర చేస్తుంటే చేస్తుండొచ్చు కానీ.. హీరో మాత్రం అయి ఉండడని భావించారు. కానీ ఈ సినిమాలో అతను హీరో పాత్రనే పోషిస్తున్నట్లు ఇప్పుడు ఖరారైంది.

రాజేష్ ఫ్రెండ్ అయిన మరో కమెడియన్ తాగుబోతు రమేష్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. రాజేష్ తో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసి.. ‘‘నాయకి సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న నా ఫ్రెండు రాజేష్ కు ఆల్ ద బెస్ట్’’ అంటూ మెసేజ్ పెట్టాడు. ఈ ఫొటోలో రాజేష్ గెటప్ చూసినా.. అతను హీరో పాత్రే చేస్తున్నాడన్న విషయం అర్థమైపోతుంది. రాజేష్ రేంజికి ఓ సినిమాలో హీరో కావడమే గొప్ప విషయమంటే.. అది కూడా త్రిష సరసన ఛాన్స్ అంటే మూమూలు సంగతి కాదు. ఎంత లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినా.. రాజేష్ కు ఇది గోల్డెన్ ఛాన్సే. గోవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది.