Begin typing your search above and press return to search.

పవన్‌ 'సత్యాగ్రహి' ని హైజాక్‌ చేసిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   2 Sept 2020 11:03 PM IST
పవన్‌ సత్యాగ్రహి ని హైజాక్‌ చేసిన హీరోయిన్‌
X
సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవి లత ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్న విషయం తెల్సిందే. పలు సామాజిక అంశాల గురించి సోషల్‌ మీడియాలో మాట్లాడుతూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్న మాధవి లత బీజేపీ వ్యవహారాల్లో కూడా కీలకంగా ఉంటోంది. పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ కార్యకర్తగా సేవలు అందిస్తోంది. 2015 తర్వాత మాధవి లత సినిమాల్లో నటించలేదు. ఇన్నాళ్లకు ఈమె సినిమాలో నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అది కూడా పవన్‌ టైటిల్‌ 'సత్యగ్రహి'తో రాబోతుంది.

నేడు పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే సందర్బంగా మాధవిలత ప్రధాన పాత్రలో సత్యాగ్రహి సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేశారు. పుష్కర కాలంకు ముందు పవన్‌ హీరోగా సత్యాగ్రహి అనే సినిమా ప్రకటన వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి కథ కూడా రెడీ అయ్యిందని షూటింగ్‌ ప్రారంభం కాబోతుందని అన్నారు. ఏం జరిగిందో ఏమో కాని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సినిమాను చేయలేదు. సత్యాగ్రహి టైటిల్‌ బాగున్న కూడా పవన్‌ మూవీ అంటూ జనాల్లోకి వెళ్లడంతో దాన్ని ఎవరు టచ్‌ చేయలేదు.

ఇప్పుడు మాధవి లత ఆ టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్‌ కథతో ఈ సినిమా ఉంటుందా లేదంటే పవన్‌ లాంటి ఒక లేడీ నాయకురాలి కథతో ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి. ఈ పోస్టర్‌ లో మా నాయకుడు ఓట్లు అడగమని చెప్పారు.. కొనమని చెప్పలేదు అంటూ క్యాప్షన్‌ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించబోతుండగా గంగారెడ్డి సినిమాను నిర్మించబోతున్నాడు.