Begin typing your search above and press return to search.

చిరు - బాలయ్య సినిమాల మధ్యలో సత్యదేవ్ 'తిమ్మరుసు'..!

By:  Tupaki Desk   |   31 March 2021 9:30 AM GMT
చిరు - బాలయ్య సినిమాల మధ్యలో సత్యదేవ్ తిమ్మరుసు..!
X
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''తిమ్మరుసు''. 'అసైన్‌మెంట్‌ వాలి' అనేది దీనికి ఉపశీర్షిక. 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్‌ కొప్పిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న 'తిమ్మరుసు' చిత్రంలో న్యాయాన్ని గెలిపించడానికి ఎంత దూరమైనా వెళ్లే లాయర్‌ పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

'తిమ్మరుసు' చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 21న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మే 14న మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'.. మే 28న నందమూరి బాలకృష్ణ 'బీబీ3' సినిమాలు ఉండటంతో సేఫ్ సైడ్ గా మధ్యలో తేదీని సత్యదేవ్ 'తిమ్మరుసు' కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్ కూడా మంచి స్పందన తెచ్చుకున్నాయి. శ్రీ చరణ్ పాకల ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో బ్రహ్మాజీ - అజయ్‌ - ప్రవీణ్‌ - ఆదర్శ్‌ బాలకృష్ణ - ఝాన్సీ - వైవా హర్ష - సంధ్యా - జనక్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.