Begin typing your search above and press return to search.
విలక్షణ పాత్రలతో దూసుకెళుతున్న సత్యదేవ్
By: Tupaki Desk | 8 Dec 2020 3:00 PM ISTఒకప్పుడు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం .. ఎంట్రీ ఇచ్చాక ఇంకాస్త కష్టపడితే నిలదొక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడం తేలికే .. కాకపోతే నిలబడటమే చాలా కష్టం. ఆర్థికపరమైన ఇబ్బందులు లేనివాళ్లు .. తెరపై కనిపించాలనే ఆసక్తి ఉన్నవారు, సరదాగా స్టూడియోల చుట్టూ ఒక రౌండ్ వేయవచ్చు. కానీ చాలీచాలని డబ్బులు జేబులో వేసుకుని వచ్చి, ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియక స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్లు ఇక్కడ ఎక్కువ రోజులు నిరీక్షించలేరు. నిరాశను .. నిరుత్సాహ పరిచేవాళ్లను దాటుకుంటూ అనుకున్న స్థాయికి చేరుకోవడం దాదాపు అగ్నిపరీక్ష వంటిదే అనుకోవాలి. అవకాశానికీ .. అవకాశానికి మధ్య అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సాగే ఈ ప్రయాణంలో అలసట లేకుండా చేసేది అంకితభావం మాత్రమే.
ఒక పనిని పనిగా చేసేవాళ్లు చాలామందే ఉంటారు .. ఆ పనిని ఓ యజ్ఞంలా తలిచేవారు .. తపస్సులా భావించేవారు మాత్రమే విజయాలను అందుకోగలుగుతారు. గుంపులో గోవిందంలా కాకుండా ప్రత్యేకమైన గుర్తింపును సాధించగలుగుతారు. అలా కాలం పెట్టే కష్టాలను తట్టుకుంటూ కెరియర్ ను కొనసాగిస్తున్న నటుల్లో 'సత్యదేవ్' ఒకరుగా కనిపిస్తాడు. 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమా ద్వారా సత్యదేవ్ తెలుగు తెరకి పరిచయమయ్యాడు. అప్పడు ఆ సినిమా చూసినవాళ్లకి ఆయన ఎవరో తెలిసే అవకాశం కూడా లేదు. అలా చిన్నచిన్న పాత్రలతో కెరియర్ ను నెట్టుకొస్తూ, 'జ్యోతిలక్ష్మి' .. 'క్షణం' సినిమాలతో తన ఉనికిని చాటుకున్నాడు. 'బ్లఫ్ మాస్టర్' సినిమాతో టైటిల్ రోల్ చేసి, నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఆ తరువాత ఆయన కథానాయకుడిగా మాత్రమే చేస్తానంటూ కాలక్షేపం చేయలేదు. ముఖ్యమైన పాత్రలు చేయడానికి ముందుకు వచ్చాడు .. కీలకమైన పాత్రలను చేయడానికి కుతూహలాన్ని చూపించాడు. కథ ప్రధానమైన సినిమాల్లో కనిపించడానికి వెనుకాడలేదు. ఈ కారణంగానే సత్యదేవ్ కొన్ని విభిన్నమైన పాత్రలను చేయగలిగాడు .. ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకోగలిగాడు. 'బ్రోచేవారెవరురా' .. 'రాగల 24 గంటల్లో' .. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో ఆయనకి వైవిధ్యభరితమైన పాత్రలు పడ్డాయి. ఈ పాత్రలు నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా ఆయనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించింది.
ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో 'గుర్తుందా శీతాకాలం' .. 'తిమ్మరుసు' సినిమాలు ఉన్నాయి. నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'గుర్తుందా శీతాకాలం'లో సత్యదేవ్ కథానాయకుడిగా కనిపించనున్నాడు. అతని సరసన తమన్నా నాయికగా నటిస్తోంది. ఇది ప్రేమకథా చిత్రం కావడం .. తమన్నా అతని జోడీ కట్టడం విశేషం. ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక 'తిమ్మరుసు' గురించి కూడా ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చించుకుంటున్నారు.
శ్రీకృష్ణదేవరాయల దగ్గర మహామంత్రిగా ఉన్న 'తిమ్మరుసు' పేరును ఈ సినిమాకి టైటిల్ గా సెట్ చేయడం, హీరో చేసేది చట్టంతో పోరాటమనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఇటీవల వచ్చిన పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రేపు టీజర్ రానుంది. కథానాయికగా ఈ సారి ఎలాగైనా కుర్రాళ్ల హార్టు ఫోర్టులో పాగా వేయాలనే పట్టుదలతోనే ప్రియాంక జవాల్కర్ ఉంది. ఈ సినిమా తన కెరియర్ కి మంచి బ్రేక్ ఇస్తుందనే ఉత్సాహంతోనే సత్యదేవ్ ఉన్నాడు. చూస్తుంటే సత్యదేవ్ కి కలిసొచ్చే కాలం నడిచొచ్చినట్టే కనిపిస్తోంది కదూ.