Begin typing your search above and press return to search.

సునీల్ ఛాన్స్ కొట్టేశాడు.. చూస్తారా?

By:  Tupaki Desk   |   26 Jan 2018 3:53 AM GMT
కమెడియన్ గా ఉన్నప్పుడు రిజల్ట్ ఎలా ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉన్న సునీల్ ఒక్కసారిగా హీరోగా టర్న్ అయ్యే సరికి రెమ్యునరేషన్స్ బాగానే వస్తున్నా సక్సెస్లే దోబూచులాడుతున్నాయి. మొదటి రెండు హిట్స్ బాగానే అందుకున్నా ఆ తరువాత ఏ స్థాయిలోను విజయాన్ని అందుకోలేదు. రీసెంట్ గా వచ్చిన 2 కంట్రీస్ అయితే డిజాస్టర్స్ లో టాప్ లో నిలిచింది. నిర్మాతలకు బయ్యర్లకు ఏ మాత్రం లాభం కలగలేదు.

దీంతో సునీల్ కెరీర్ క్లోజ్ అయినట్టే అని అనేక మీడియాల్లో కథనాలను వెలువడుతున్నాయి. ఎందుకంటే చేతుల్లో ఉన్న ప్రస్తుత సినిమాలు కూడా చేజారిపోతున్నాయి. సునీల్ ని కాదని నిర్మాతలు అతని కంటే చిన్న స్థాయిలో ఉన్న నటులను ఎంచుకోవడం గమనార్హం. నిర్మాత కృష్ణ ప్రసాద్ తురంగ వేట్టై అనే తమిళ్ సినిమాను సునీల్ తో తీయాలని అనుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ సడన్ గా ప్లేట్ ఫిరాయించారని తెలుస్తోంది.

జ్యోతి లక్ష్మి సినిమాలో నటించిన తెలుగు కుర్రాడు సత్యదేవ్ ని ఆ రీమేక్ లో సెట్ చేసుకున్నారట. అయితే సునీల్ ని మార్చడానికి మరో కారణం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. సీరియల్ కథలా ఉండే ఆ కథలో కొన్ని మార్పులు చేద్దామనే డిస్కర్షన్ విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా సునీల్ తో చేస్తే.. కనీసం కొంతమంది అయినా చూస్తారు. కానీ ఈ హీరో చేస్తే అసలు ఎవరైనా పట్టించుకుంటారా?? అనే సందేహం కూడా ఇప్పుడు జనాల్లో కలుగుతోంది.