Begin typing your search above and press return to search.
కమెడియన్ సత్య హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయినట్లేనా..?
By: Tupaki Desk | 28 Aug 2021 4:02 PM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హాస్యనటులు తమ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూనే.. మరో అడుగు ముందుకేసి హీరోలుగా సినిమాలు చేశారు. అప్పటి రాజబాబు - రేలంగి దగ్గర నుంచి.. ఇప్పటి బ్రహ్మానందం - అలీ - ఏవీఎస్ - వేణుమాధవ్ - సునీల్ - శ్రీనివాస్ రెడ్డి - షకలక శంకర్ - సప్తగిరి - ప్రియదర్శి - సుహాష్ - రాహుల్ రామకృష్ణ - మధు నందన్ వరకు చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో లేటెస్టుగా కమెడియన్ సత్య హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వచ్చాడు.
తెలుగులో అనేక చిత్రాల్లో తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరించిన సత్య.. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. కేవలం సత్య కామెడీ వల్ల హిట్ అయిన సినిమాలు ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు హీరో సందీప్ కిషన్ తన హోమ్ బ్యానర్ లో ''వివాహ భోజనంబు'' సినిమాతో సత్య ను హీరోగా పరిచయం చేశాడు. సోనీ లివ్ ఓటీటీలో శుక్రవారం ఈ మూవీ రిలీజ్ అయింది. కరోనా నేపథ్యంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకున్నప్పటికీ.. సత్య నటనకు మాత్రం మంచి మార్కులు వేస్తున్నారు.
ఇన్నాళ్లూ కమెడియన్ గా సినిమాలో ఓ భాగంగా ఉంటూ వచ్చిన సత్య.. హీరోగా ఫుల్ లెంగ్త్ రోల్ లో 'వివాహ భోజనంబు' సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు. ఈ చిత్రంతో సత్యలో ఎంత మంచి నటుడు దాగి ఉన్నాడనేది తెలిసిందని ఆడియన్స్ అంటున్నారు. కామెడీతో ఆద్యంతం ఆకట్టుకున్న సత్య.. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించాడు. అందుకే కమెడియన్ గా కొనసాగుతూనే అవకాశం వచ్చినప్పుడు హీరోగా సినిమాలు చేస్తే సత్య కెరీర్ బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోయిజం చూపించే సినిమాలు కాకుండా కామెడీ ప్రధానంగా సాగే చిత్రాల్లో హీరోగా చేసుకుంటూపోతే సత్య కెరీర్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.