Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ తో బ్ల‌ఫ్ మాస్ట‌‌ర్

By:  Tupaki Desk   |   22 April 2020 10:30 AM IST
ఫోటో స్టోరి: మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ తో బ్ల‌ఫ్ మాస్ట‌‌ర్
X
సినిమా ఇండ‌స్ట్రీలో గుర్తింపు అంత ఈజీ కాదు. అందుకు ఏళ్లకు ఏళ్ల‌ స‌మ‌యం ప‌డుతుంది. హీరోగా ఎద‌గ‌లాన్నా... ఆర్టిస్ట్ గా రాణించాల‌న్నా.. ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి. అయితే ఇవ‌న్నీ ఉన్నా! కొంద‌రికి క‌లిసి రాదు. కొంద‌రికి క‌లిసొస్తుంది. అలాంటి వాళ్లే స్టార్ల్ గా ముందుకు సాగుతారు. ఇక్క‌డ ట్యాలెంట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌డూ స‌క్సెస్ అయింది లేదు. ట్యాలెంట్ లేని వాడు ఒక్కోసారి త‌న‌ని తాను బ్ర‌ష‌ప్ చేసుకుని ఎదిగే వీలున్న ప‌రిశ్ర‌మ మ‌న‌ది. అప్ప‌టి స‌న్నివేశాన్ని బ‌ట్టి ఏదైనా డిసైడ్ అవుతుంది. ఆ కోవ‌లోనే స‌త్య దేవ్ ముందుగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత హీరోగానూ అడుగులు వేసాడు. ఒక్కో ఛాన్స్ ఒడిసిప‌డుతున్నాడు.

బేసిగ్గా సాప్ట్ వేర్ ఇంజ‌నీర్ అయిన స‌త్య‌దేవ్ పార్ట్ టైమ్ జాబ్ లాగా సినిమాల్లోకి వ‌చ్చాడు. ఉద్యోగం చేసుకుంటూనే సినిమా ప్ర‌య‌త్నాలు చేసాడు. ఇక్క‌డ నిల‌బ‌డ‌గ‌ల‌ను అన్న న‌మ్మ‌కం కుదిరిన త‌ర్వాత‌...కొంత స‌పోర్ట్ దొరికిన త‌ర్వాతే ఉద్యోగం మానేసి సినిమాల్లో బిజీ అయ్యాడు. ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండా ఆర్టిస్ట్ గా ఎదిగి నేడు స్టార్ గా ఎదుగుతున్నాడు. అయితే స‌త్య‌దేవ్ తొలుత ప్ర‌భాస్ న‌టించిన `మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్` లో న‌టించిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌భాస్..స‌త్య‌దేవ్ క‌లిసి దిగిన ఓ ఫోట‌ను అభిమానుల‌తో షేర్ చేసుకోవ‌డంతోనే ఈ విష‌యం తెలిసింది. అందులో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే చిన్న పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించాడుట‌.

కానీ దాన్ని ఎవ్వ‌రూ గుర్తించి ఉండ‌రు. ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్ టాలీవుడ్ లో బాగానే రాణిస్తున్నాడు. చిన్న న‌టుడిగా ప్రారంభ‌మై సోలో హీరోగా అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా పూరి జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచిన `జ్యోతి ల‌క్ష్మి` చిత్రంతో స‌త్య‌దేవ్ కి బాగా గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఘాజీ లో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకున్నాడు. ఆ పాత్ర‌లో స‌త్య‌దేవ్ స‌హ‌జంగా న‌టించి మెప్పించాడు. ప్ర‌స్తుతం `ఉమామ‌హేశ్వ‌రావు ఉగ్ర‌రూప‌స్య` అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇది ఓ మ‌ల‌యాళం చిత్రానికి తెలుగు రీమేక్. కేరాఫ్ కంచ‌ర‌పాలెం ద‌ర్శ‌కుడు మ‌హా వెంక‌టేష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. స‌త్య‌దేవ్ అంత‌కు ముందు `బ్ల‌ఫ్ మాస్ట‌ర్` లో హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే.