Begin typing your search above and press return to search.

ఉగ్రనీడల్లో షూటింగ్.. అందరూ వెయిటింగ్

By:  Tupaki Desk   |   6 Nov 2017 6:36 AM GMT
ఉగ్రనీడల్లో షూటింగ్.. అందరూ వెయిటింగ్
X
కొందరి కుర్ర హీరోల అదృష్టం ఏమిటో గాని సైడ్ రోల్స్ చేస్తూనే సినిమా ఛాన్సులు దక్కించుకుంటారు. చూస్తుందగానే హీరోలు అయిపోతారు. సినీ ఫీల్డ్ లో ఇలాంటి కష్టజీవులు చాలానే ఉన్నారు. కానీ అందరు అనుకున్నది సాదించలేరు. కొందరు మధ్యలోనే ఆగిపోతే మరికొందరు సాధ్యమైనంత వరకు కష్టపడి అవకాశాలను దక్కించుకుంటారు. అయితే ఇదే తరహాలో ఓ తెలుగు హీరో చాలా కష్టపడుతున్నాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో జ్యోతిలక్ష్మి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరో రోల్ చేసిన సత్యదేవ్ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తెలుగులో అంతగా ఫేమస్ అవ్వలేదు గాని చేసిన సినిమాల్లో నటుడిగా మంచి మార్కులే కొట్టేశాడు. ముఖ్యంగా ఘాజి సినిమాలో తనదైన శైలిలో నటించి మెప్పించాడు ఈ యువ నటుడు. ప్రస్తుతం బాలీవుడ్ లో హాబీబ్ అనే సినిమాను చేస్తున్నాడు.

టెర్రరిజమ్ కాన్సెప్ట్ తో సాగే ఈ కథను హైదరాబాద్ అమ్మాయి జెన్నిఫర్ అల్ఫోన్స్ తెరకెక్కిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ లో జరుగుతోంది. రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యదేవ్ అక్కడి పరిసర ప్రాంతాల గురించి తెలిపాడు. ఉగ్రవాద చర్యలు జరిగే చోట షూటింగ్ చేస్తున్నాం. ఆఫ్ఘన్ - పాక్ సరిహద్దులో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని అయితే ఒక్కోసారి బాంబులు పేలిన శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పాడు. ఇకపోతే అక్కడి ప్రజలు చాలా మంచివారని ఇండియన్స్ ని చాలా ఇష్టపడతారని వివరించాడు.

గతంలో ఇలాంటి పరిసరాల్లోనే కమల్ హాసన్ కూడా విశ్వరూపం సినిమాను తీశాడు. ఆ సినిమాలో విజువల్స్ అన్నీ చాలా షాకింగ్ గా ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా అందరూ ఈ హబీబ్ సినిమా ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు.