Begin typing your search above and press return to search.

క్రేజీ రోల్స్ పడుతున్న మాస్టర్

By:  Tupaki Desk   |   3 Sep 2019 2:30 PM GMT
క్రేజీ రోల్స్ పడుతున్న మాస్టర్
X
పరిశ్రమకు వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా 2015లో వచ్చిన పూరి జగన్నాధ్ జ్యోతిలక్ష్మితో గుర్తింపు తెచ్చుకున్న సత్య దేవ్ ఈ ఏడాది నుంచి ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. గత సంవత్సరం చేసిన బ్లఫ్ మాస్టర్ కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించనప్పటికీ నటన పరంగా సత్యదేవ్ పెరఫార్మన్స్ మంచి మార్కులు తెచ్చుకుంది. ఇక ఇటీవలే చేసిన బ్రోచేవారెవరురా సక్సెస్ కాగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కావడంతో గ్రాఫ్ అమాంతం పెరిగిపోతోంది. వరుణ్ తేజ్ అంతరిక్షంలోనూ డ్యూయల్ రోల్ చేసి మెప్పించిన సత్యదేవ్ ఇప్పుడు చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగమవుతున్నాడు.

రాజమౌళి రూపొందిస్తున్న మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ తో పాటు మహేష్ 26వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరులు కూడా కీలక పాత్రలు దక్కినట్టు తెలిసింది. ఇవి కనక క్లిక్ అయితే సత్యదేవ్ కెరీర్ మెట్రో స్పీడ్ లో దూసుకుపోవడం ఖాయమే. తనదైన రోజు కోసం ఏళ్ళు వేచి చూసిన సత్య దేవ్ ఇప్పుడు స్టార్ హీరోలు దర్శకుల కళ్ళలో పడుతున్నాడు.

సోలో హీరోగా నటించిన మరో సినిమా 47 డేస్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదీ హిట్ అయ్యిందంటే ఒకపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోపక్కా కథానాయకుడిగా బిజీ అయిపోతాడు సత్యదేవ్. హీరో మెటీరియల్ ఉన్నప్పటికీ టైం కలిసిరాక సపోర్టింగ్ రోల్స్ కు పరిమితమైన సత్యదేవ్ ఇప్పుడు దృష్టి మొత్తం తనకిచ్చిన పాత్రల ద్వారా ప్రేక్షకులతో మెప్పు పొందే ప్రయత్నంలో ఉన్నాడు. పైన చెప్పిన క్రేజీ మూవీస్ రెండూ 2019లోనే విడుదలవుతాయి కాబట్టి అక్కడి నుంచి దశ మాములుగా తిరిగేలా లేదు