Begin typing your search above and press return to search.

‘గాడ్సే’గా రాబోతున్న సత్యదేవ్!

By:  Tupaki Desk   |   3 Jan 2021 9:30 AM GMT
‘గాడ్సే’గా రాబోతున్న సత్యదేవ్!
X
ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఒక్కో మెట్టు ఎక్కుతున్న హీరో సత్యదేవ్. బహుముఖ నటుడిగా లైమ్ లైట్లోకి వస్తున్న సత్య దేవ్.. తన డెసిషన్ మేకింగ్ తో మంచి కథలను ఎన్నుకుంటున్నాడు. ఈ హీరో నెక్స్ట్ ‘గాడ్సే’గా రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా ‘బ్లఫ్ మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఆ మూవీని రూపొందించిన దర్శకుడు గోపి గణేష్ పట్టాభినే ‘గాడ్సే’ను తెరకెక్కించబోతున్నాడు. ‘బ్లఫ్ మాస్టర్’‌తో ప్రశంసలు అందుకున్న ఈ ద్వయం.. సక్సెస్ ను రిపీట్ చేయాలని పట్టుదలగా ఉన్నారు.

‘గాడ్సే’ ఫస్ట్ లుక్ కూడా లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని యాాంగ్రీ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్.. సినిమా మొత్తం యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పకనే చెబుతోంది. పవర్ ఫుల్ టైటిల్ కు తగ్గట్టుగా ఉన్న సత్యదేవ్ లుక్.. అందరినీ ఆకట్టుకుంటోంది.

గతంలో సత్యదేవ్ ను తన జ్యోతిలక్ష్మి సినిమాలో విలక్షణ పాత్రలో చూపించిన నిర్మాత సి. కళ్యాణ్ నే ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. ఇంకా.. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్యమీనన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ చిత్రానికి కథ, మాటలు కూడా దర్శకుడు గోపీగణేష్ అందిస్తున్నారు.