Begin typing your search above and press return to search.

శతమానం తరువాత శ్రీనివాస కళ్యాణం

By:  Tupaki Desk   |   22 Feb 2017 9:50 AM GMT
శతమానం తరువాత శ్రీనివాస కళ్యాణం
X
దర్శకుడిగా మారిన తరువాత ఎట్టకేలకు తొలి హిట్టు సాధించి మాంచి ఊపు మీదున్నాడు రైటర్ సతీష్‌ వేగేశ్న. ఆయన తీసిన శతమానం భవతి సినిమా శర్వానంద్ కెరియర్లోనే బిగ్గెస్టు హిట్టుగా నిలిచింది. అయితే ఈ హిట్టు స్ర్టీక్ ను అలానే కంటిన్యూ చేయడానికి ఆయన నిర్మాత దిల్ రాజుతో కలసి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ స్టోరీతో రానున్నాడట.

ఇప్పటికే కథను పూర్తి స్థాయిలో సిద్దం చేసుకున్న సతీష్‌.. ఆ సినిమాకు ''శ్రీనివాస కళ్యాణం'' అనే పేరును ఫిక్సు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో నాగార్జున హీరోగా చేస్తే బాగుంటుందని దిల్ రాజు కూడా ఫిక్సయ్యారట. ఇప్పటికే నాగార్జునకు కథ చెప్పగా.. ఆయన రాజు గారి గది 2 సినిమా పూర్తయ్యాక ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారట. నిజానికి అప్పట్లో సతీష్‌ డైరక్షన్లో దిల్ రాజు ప్రొడక్షన్లో 'మనం' సినిమాకు సీక్వెల్ తీస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ కూడా రూమర్లేనని నాగ్ స్వయంగా చెప్పేశారు. ఇప్పుడు ఈ శ్రీనివాస కళ్యాణం గురించి ఆయనేమంటారో చూడాలి.

ఇకపోతే ఓం నమో వెంకటేశాయ సినిమా రిజల్టుతో నాగ్ కాస్త అప్సెట్ అయినా కూడా.. ఆయన హ్యాపీగా రాజు గారి గది సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. యాంకర్ ఓంకార్ డైరక్షన్లో పివిప ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా తాలూకు ఔట్పుట్ బాగా వస్తోందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/