Begin typing your search above and press return to search.

తారక్ కు అసలు కథే చెప్పలేదు

By:  Tupaki Desk   |   15 Sept 2017 1:03 PM IST
తారక్ కు అసలు కథే చెప్పలేదు
X
ఎలాంటి స్క్రిప్ట్ అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఒకటికి పది సార్లు చెయ్యాలా వద్దా అని చెక్ చేసుకుంటారని టాలీవుడ్ లో ఓ టాక్ ఉంది. అంతే కాకుండా ఆయన ఇతర టాప్ దర్శకులతో కూడా ఆ కథని పోస్ట్ మార్టం కూడా చేస్తారట. అయితే రీసెంట్ గా ఇదే తరహాలో ఒక హిట్ కొట్టిన దర్శకుడి కథను ఎన్టీఆర్ వినగానే నో చెప్పాడని టాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ జై లవ కుశ సినిమా తర్వాత దిల్ రాజు తో 'శ్రీనివాస కళ్యాణం' ఓకే చేశాడని వార్తలు వచ్చాయి. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకుడు అని కూడా చెప్పారు. అయితే ఎన్టీఆర్ ..సతీష్ చెప్పిన కథని వినగానే రిజెక్ట్ చేశాడని టాక్ వినిపించింది. అసలు ఇది ఇంతకీ నిజమేనా అనే కోణంలో ఆలోచిస్తే.. అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పిన ప్రకారం.. అసలు ఎన్టీఆర్ ని దర్శకుడు సతీష్ వేగేశ్న అస్సలు కలవలేదట. కేవలం దిల్ రాజు మాత్రమే వెళ్లి తారక్ కి కొన్ని పాయింట్స్ ని చెప్పాడు. దీంతో తారక్ కి ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. వెంటనే వేగేశ్న ని మొత్తం కథని రెడీ చేసుకొని తన దగ్గరికి తీసుకురమ్మని తారక్ చెప్పాడట.

ప్రస్తుతం ఎన్టీఆర్ బిగ్ బాస్ ముగింపుకు వస్తోంది కాబట్టి అందులోనూ మరో వైపు జై లవకుశ రిలీజ్ కు రెడీ అవుతోంది గనక ఆ రెండు పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో ఆ పనులన్నీ పూర్తయ్యాక సతీశ్ ఎన్టీఆర్ ను కలిసి ఫుల్ స్క్రిప్ట్ చెప్పేస్తాడట. అయితే సతీష్ కి స్టోరీ చెప్పడంలో మంచి అనుభవం ఉంది. ఆయన ఇంతకుముందు చాలా కథలకు స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అందులోనూ శతమానం భవతి హిట్ అందుకున్నాడు. ఇక తారక్ కి కూడా ఫ్యామిలీ కథలంటే చాలా ఇష్టం. ఇక సతీష్ చెప్పే కథను ఎన్టీఆర్ ఏ మాత్రం రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదని తెలుస్తోంది.. ఇది సంగతి.