Begin typing your search above and press return to search.

విజయ్ మాల్య మీద మెగాస్టార్ సెటైర్స్?

By:  Tupaki Desk   |   19 Sep 2016 10:30 PM GMT
విజయ్ మాల్య మీద మెగాస్టార్ సెటైర్స్?
X
ఇప్పుడు ''ఖైదీ నెం 150'' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఏం చూపించబోతున్నారు అంటే.. ఖచ్చితంగా ఆయన రీమేక్ ప్రొడక్టులను ఎప్పుడూ ఒరిజినల్ కంటే బెటర్ గా తీర్చిదిద్దేస్తారు కాబట్టి.. ఏదో కొత్తగా చూపిస్తారనే నమ్మకం ఆడియన్స్ కు ఉంది. పైగా గతంలో చిరంజీవి అంట్ వినాయక్ కలసి.. ఠాగూర్ సినిమాను ఒరిజినల్ కంటే బెటర్ గా తీశారు కాబట్టి.. ఇప్పుడు కూడా అందరూ అలాంటి మ్యాజక్ కోసమే ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ 'కత్తి' సినిమాలో విలన్ క్యారక్టర్ చాలా పోష్ గా ఉండే ఒక బిజినెస్ మ్యాన్. కాకపోతే తమిళంలో మాత్రం ఎవ్వరినీ విమర్శలు చేసే దిశగా ఆ క్యారక్టర్ రూపొందించలేదు మురుగుదాస్. కాని తెలుగులో మాత్రం ఏకంగా విజయ్ మాల్యా తరహాలో ఉండే క్యారక్టర్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా విలన్ పాత్రను పోషిస్తున్న హీరోయిన్ అంజలా జెవేరీ మొగుడు తరుణ్‌ అరోరా చెప్పాడు. తనకు విజయ్ మాల్యా తరహా క్యారక్టర్ అంటూ బ్రీఫ్‌ ఇచ్చారని.. ఇప్పటికే తొలి షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తి చేశానని.. రెండో షెడ్యూల్ ఈ బుధవారం నుండి చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు.

కాకపోతే మనోడు రివీల్ చేసిన విషయాల్లో అన్నింటికంటే షాకింగ్ ఏంటంటే.. అసలు విజయ మాల్యా తరహా క్యారెక్టర్ అని చెప్పడమే. ఇప్పటికే దాదాపు దివాళా తీసేసి ఫారిన్ లో తలదాచుకున్న ఈ కింగ్ ఫిషర్ ఘనుడు.. కింగ్ ఫిషర్ పక్షిలా ఇండియా నుండి ఎగిరిపోయాడంటూ కోర్టులు కూడా కామెంట్లు చేస్తున్న వేళ.. చిరంజీవి ఇలా ఆయన్ను టార్గెట్ చేశారనే విషయం చాలా గమ్మత్తుగా ఉంది కదూ.