Begin typing your search above and press return to search.

షారూక్ జీరోపై ఎన్ని జోకులో

By:  Tupaki Desk   |   4 Jan 2018 6:30 PM GMT
షారూక్ జీరోపై ఎన్ని జోకులో
X
షారూక్ ఖాన్ తన లేటెస్ట్ మూవీ డీటైల్స్ గ్రాండ్ గానే అనౌన్స్ చేశాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ ని రిలీజ్ చేసిన షారూక్.. ఇందులో తన పాత్రకు సంబంధించిన సీక్రెట్ రివీల్ చేస్తూ.. ఓ చిన్నపాటి వీడియో ఇచ్చాడు. మరుగుజ్జు అవతారంలో ఉన్న కింగ్ ఖాన్.. జజ్ జబ్ ఫూల్ ఖిలే మూవీలో మహమ్మద్ రఫీ పాడిన ఇస్ దివానే దిల్ నే క్యా జాదూ చలాయా పాటకు డ్యాన్సులు వేశాడు.

ఈ జీరో మూవీలో షారూక్ ఖాన్ తో పాటు కత్రినా కైఫ్.. అనుష్క శర్మ కోహ్లి నటిస్తున్నారు. ఇంతవరకూ అంతా ఓకే అయినా.. జీరో అనే టైటిల్ దగ్గరే చాలామంది కామెడీ చేసేస్తున్నారు. సోషల్ మీడియా జనాలు అయితే ఓ రేంజ్ లో జీరోతో ఆడేసుకుంటున్నారు. డిసెంబర్ 21న సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడే ట్రెండింగ్ అయిపోతోందంటే.. జీరోపై జోకుల రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. 'సల్మాన్ కు మొదట ఈ మూవీని ఆఫర్ చేసినా.. తన అభిమానుల ఐక్యూ లెవెల్ కు మ్యాచ్ అవదని తిరస్కరించాడు' అనే జోక్ బాగా పేలగా.. ఇంకా చాలానే ట్రాలింగ్ జరిగిపోతోంది.

'షారూక్ కి ఏడాదంతా పబ్లిసిటీ గ్యారంటీ. పెట్రోల్ బంకుల్లో జీరో చూసుకోండి అని చెప్పే సెంటెన్స్.. బాగా ఉపయోగపడుతుంది'.

'తమ టీం మొత్తం ఐక్యూ లెవెల్ ను ప్రతిబింబించే టైటిల్ పెట్టే ముందు తమను సంప్రదించకపోవడంతో.. జీరోపై కర్ణి సేన ఆగ్రహంగా ఉంది'.

'విరాట్ కోహ్లీ డక్ అవుట్ అయితే.. జీరోకే అవుట్ అయి తన సినిమాకు ప్రమోట్ చేసినందుకు అనుష్క శర్మ థ్యాంక్స్ చెబుతుంది'.

'రయీస్ నుంచి జీరోకి.. విజయ్ మాల్యాను ఫుల్లుగా ఫాలో అవుతున్న షారూక్ ఖాన్'.

'ఈ సినిమాకు తన యాక్టింగ్ తో కత్రినా కైఫ్ అందించే వాటా'.

...ఇలా బోలెడన్ని జోకులు జీరో చుట్టూ పేలుతూనే ఉన్నాయి.