Begin typing your search above and press return to search.

పూరీ అసిస్టెంట్ గా జక్కన్న...!

By:  Tupaki Desk   |   20 April 2020 12:00 AM IST
పూరీ అసిస్టెంట్ గా జక్కన్న...!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సినిమా తెరకెక్కించడానికి ఎక్కువ టైమ్ తీసుకునే దర్శకుడు ఎవరంటే.. అందరు టక్కున చెప్పే పేరు 'రాజమౌళి'. దర్శధీరుడు రాజమౌళి ఒక సినిమా చేయడానికి మినిమమ్ రెండేళ్ల సమయం తీసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. నిజానికి రాజమౌళి తన సినిమాలో పర్ఫెక్షనిజమ్ కోసం కోసం అంత టైం తీసుకుంటాడనేది ఆయనతో పనిచేసిన వారు చెప్పే మాట. ఒక సాధారణ కథని తీసుకొని అసాధారణ రీతిలో చూపించడం రాజమౌళి స్టైల్. ఒక సినిమాని ఆ రేంజ్ లో చెక్కుతాడు కాబట్టే ఆయన్ని అందరూ 'జక్కన్న' అని పిలుస్తారు. అదే విధంగా ఒక సినిమాని తక్కువ టైంలో కంప్లీట్ చేసే స్టార్ డైరెక్టర్ ఎవరని అడిగితే అందరూ వెంటనే చెప్పే పేరు 'పూరీ జగన్నాథ్'. ఎంత పెద్ద స్టార్ హీరోతో అయినా కొన్ని రోజుల్లో సినిమా పూర్తి చేసి థియేటర్లలో వదలడం పూరీ స్టైల్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళిని 'మీరు పూరీ వద్ద అసిస్టెంట్ గా ఎప్పుడు చేయబోతున్నారు' అని అడుగుతున్నారట. దానికి కారణం లేకపోలేదు. గతంలో ఒక ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి 'పూరీ అవకాశం ఇస్తే తన వద్ద అసిస్టెంట్ గా పనిచేయాలనుంది' అని అనడమే ఇప్పుడు నెటిజన్లు అలా అడగడానికి కారణం.

అసలు కథేంటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'బిజినెస్ మ్యాన్' సినిమా ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. రాజమౌళి మాట్లాడుతూ.. 'కేవలం డైలాగ్స్ తో సూపర్ హిట్ కొట్టే డైరెక్టర్ పూరీ అని.. ఒక సినిమా తక్కువ టైములో సినిమా తీసి హిట్ ఎలా కొట్టాలో పూరీని చూసి నేర్చుకోమని తన భార్య సలహా ఇచ్చిందని.. మేము ఒక హిట్ సినిమా తీయడానికి సంవత్సరాలు సంవత్సరాలు టైం తీసుకుంటామని.. పూరీ మాత్రం ఏడాదికొక ఇండస్ట్రీ హిట్ కొడుతుంటాడు.. జగన్ అవకాశమిస్తే రెండు రోజులు ఆయన సినిమాకి అసిస్టెంట్ గా పనిచేయాలని ఉంది' అని అన్నారు. మహేష్ బాబుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ఈ తరుణంలో నెటిజన్లు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే రాజమౌళిని పూరీకి ఎప్పుడు అసిస్టెంట్ గా పని చేయబోతున్నారు అంటూ సరదాగా ప్రశ్నిస్తున్నారు.