Begin typing your search above and press return to search.

​​మామ కట్టప్ప బిజీ అయినట్లే

By:  Tupaki Desk   |   25 July 2017 7:37 AM GMT
​​మామ కట్టప్ప బిజీ అయినట్లే
X
తమిళనాడులో బాహుబలి సినిమాలా ఒక భారీ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది నిర్మాణ సంస్థకు. సంఘమిత్ర గా మొదట శృతి హాసన్ అనుకున్నారు కాని కొన్ని వివాదాల మధ్య ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఇప్పుడు సంఘమిత్ర లీడ్ రోల్ ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు చిత్ర యూనిట్. అయితే సంఘమిత్ర పాత్ర ఎవరు చేసేది అనేది పక్కన పెడితే మిగతా పాత్రలు కోసం అందరిని సెలెక్ట్ చేసేయడం జరుగుతుంది.

బాహుబలిలో కట్టప్ప మామగా కనిపించిన సత్యరాజ్‌ కి అంతవరకు లేని క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. నార్త్ లో సత్యరాజ్‌ అనే పేరు కూడా ఎవరికి తెలిసి ఉండదు. బాహుబలితో ఇక్కడే కాదు అక్కడ కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. సత్యరాజ్‌ కట్టప్ప పాత్ర పాపులర్ కావడంతో ఇప్పుడు సత్యరాజ్‌ కి అటువంటి పాత్రే ఒకటి సంఘమిత్రలో చేసే అవకాశం వచ్చింది అని చెబుతున్నారు తమిళ్ సినీ వర్గాలు. ఇంకా ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు కానీ దాదాపుగా సత్యరాజే చేస్తాడట. ఈ సినిమా ఊహాగానాలు ఎలా ఉన్న ఇప్పుడు సత్యరాజ్‌ తమిళ్ సినిమాలో బాగా బిజీ అయ్యాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్‌ నటిస్తున్న మెర్సల్‌ సినిమాలో అలానే వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న ఓ మల్టీస్టారర్‌ చిత్రంలో నటుస్తున్నాడు.

సంఘమిత్ర సినిమాను సుందర్‌.సి డైరెక్ట్ చేయబోతున్నాడు. థెనాండల్‌ ఫిలింస్‌ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్యా కథానాయకులుగా నటిస్తున్నారు. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఒక్కక్కరుగా ఈ సినిమా టీమ్ లో చేరుతూనే ఉన్న సినిమా నిర్మాణ పనులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు అని తెలుస్తుంది. బహుశా వచ్చే ఏడాది చివరి నెలలో విడుదల కావచ్చు అని చెబుతున్నారు నిర్మాణ సంస్థ. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్ 90 శాతం వరకు ఉంటుంది అని అందుకే ఆ పనులు వలన సినిమా వేగం కుంటిపడింది అని నటి కుషుబూ ఒక సారి వివరణ కూడా ఇచ్చారు.​