Begin typing your search above and press return to search.

ఎంజీఆర్ బ‌యోపిక్ లో క‌ట్ట‌ప్ప‌?

By:  Tupaki Desk   |   24 Oct 2017 5:47 PM GMT
ఎంజీఆర్ బ‌యోపిక్ లో క‌ట్ట‌ప్ప‌?
X

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ - కోలీవుడ్ - బాలీవుడ్ ల‌లో బ‌యోపిక్ ల హ‌వా న‌డుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ పై ఏక‌కాలంలో రెండు బ‌యోపిక్ లు తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ హీరో, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ బ‌యోపిక్ ను తెర‌కెక్కించ‌బోతున్నార‌ని కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆ బ‌యోపిక్ ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని తెలుస్తోంది. ఆ బ‌యోపిక్ లో త‌మిళ సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌రాజ్ న‌టించ‌నున్న‌ట్లు తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే నెల‌లో ఆ చిత్రాన్ని లాంచ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

తమిళనాడులో సినీ - రాజ‌కీయ రంగాల‌పై ఎంజీఆర్ త‌న‌దైన ముద్ర వేశారు. లక్షలాది మంది అభిమానులను సాధించిన ఆ లెజెండ‌రీ హీరో బయోపిక్ ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. రమణ కమ్యూనికేషన్స్ వారు బాలకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యారిన స‌మాచారం. అయితే, ఆ లెజెండ‌రీ న‌టుడి పాత్ర‌లో న‌టించ‌డ‌మంటే ఆషామాషీ కాదు. దీంతో, ఆ పాత్రకి సత్యరాజ్ న్యాయం చేస్తాడ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారట. వచ్చేనెల 8వ తేదీన పలువురు మంత్రుల సమక్షంలో తమిళనాడు సి.ఎం.పళని స్వామి క్లాప్ కొట్టడంతో ఈ సినిమా లాంచ్ అవుతోంద‌ని స‌మాచారం.