Begin typing your search above and press return to search.

సత్యరాజ్‌.. మహేష్‌ సినిమా వదులుకున్నాడా?

By:  Tupaki Desk   |   19 March 2015 9:30 AM GMT
సత్యరాజ్‌.. మహేష్‌ సినిమా వదులుకున్నాడా?
X
మహేష్‌ బాబుతో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఐతే తమిళ సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ మాత్రం మహేష్‌ సినిమాను చేజేతులా వదులుకున్నారు. ఎందుకట అంటే.. తుంగభద్ర సినిమా కోసమే. 'మిర్చి' సినిమాతో తెలుగులో ఒక్కసారిగా బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన సత్యరాజ్‌తో 'తుంగభద్ర'లో కీలక పాత్ర చేయించాలని ఫిక్సయ్యింది వారాహి చలనచిత్రం సంస్థ. వెంటనే ఆయన్ని సంప్రదించి కథ చెప్పారు. లో బడ్జెట్‌ మూవీ అయినప్పటికీ కథ బాగా నచ్చడంతో బల్క్‌ డేట్స్‌ ఇచ్చేశారట సత్యరాజ్‌. గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేశారు.

ఐతే ఈ సినిమాకు డేట్స్‌ ఇచ్చిన టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ చేస్తున్న సినిమాకు అడిగారట సత్యరాజ్‌ను. కానీ 'తుంగభద్ర' కోసం ఆ సినిమా కుదరదని చెప్పేశాడట సత్యరాజ్‌. ఈ విషయాన్ని 'తుంగభద్ర' హీరో ఆదితే స్వయంగా వెల్లడించాడు. 'మిర్చి' సినిమాతో సత్యరాజ్‌ కెరీర్‌కు టాలీవుడ్‌లో పెద్ద బ్రేక్‌ ఇచ్చాడు కొరటాల శివ. తమిళంలో కంటే కూడా తెలుగులోనే ఇప్పుడాయనకు క్రేజ్‌ ఎక్కువుంది. పారితోషకం కూడా బాగానే పుచ్చుకుంటున్నాడు. 'బాహుబలి' సినిమాలోనూ సత్యరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. 'తుంగభద్ర' లాంటి చిన్న సినిమా కోసం మహేష్‌ సినిమా సైతం వదులుకున్నాడంటే ఆయన కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాల్సిందే.