Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేస్ లో శర్వా ఉన్నాడహో

By:  Tupaki Desk   |   14 Nov 2016 5:00 PM IST
సంక్రాంతి రేస్ లో శర్వా ఉన్నాడహో
X
రాబోయే పొంగల పండుగ రంజుగా ఉంటుందనే విషయం ఇప్పటికే తెలుసు. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150.. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణిలు.. ప్రీపోన్ చేసుకుని మరీ ఒకే రోజు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఈ సంక్రాంతి పండుగ పోటీలో తానూ ఉంటానని ముందే చెప్పాడు శర్వానంద్.

శర్వా నటించిన శతమానం భవతి సంక్రాంతికి వస్తుందని ముందు నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా.. తాజా పరిస్థితుల్లో వాయిదా వేసుకుంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు యూనిట్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది. 'నవంబర్ 28తో శతమానం భవతి షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల' అంటూ ట్విట్టర్ లో నిర్మాతలు అఫీషియల్ గా ట్వీట్ పెట్టారు. దీంతో పొంగల్ కి శర్వా రావడం ఖాయమే అని తేలిపోయింది.

ఈ ఏడాది కూడా సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజాగా ఫుల్లు పోటీ మధ్యలోనే వచ్చినా సర్ ప్రైజ్ హిట్ కొట్టిన శర్వానంద్.. ఈ సారి కూడా అలాంటి ఫీట్ సాధిస్తాడనే అంచనాలున్నాయి. నిర్మాత దిల్ రాజు కావడమే రిలీజ్ విషయంలో థియేటర్ల విషయంలో సమస్యలు రావని అనేందుకు అతి పెద్ద కారణంగా చెప్పచ్చు. మరి పెద్ద సినిమాలకు థియేటర్లను కేటాయించాలనే ఒత్తిడిని తట్టుకుని.. తన సినిమాకు ఎన్ని స్క్రీన్స్ ను దిల్ రాజు కేటాయిస్తారనేదే ఆసక్తికరమైన పాయింట్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/