Begin typing your search above and press return to search.

పొంగల్ రేస్ లో మిగిలింది వాళ్లిద్దరే

By:  Tupaki Desk   |   31 Oct 2016 7:30 AM GMT
పొంగల్ రేస్ లో మిగిలింది వాళ్లిద్దరే
X
2017 పొంగల్ రేస్ పై ముందు నుంచి బోలెడంత హంగామా ఉంది. టాలీవుడ్ కి సంక్రాంతి పండుగ ముఖ్యమే కానీ.. ఈ సారి మాత్రం సీనియర్ల సినిమాలు ఆ టైమ్ కే క్యూ కట్టడం.. అన్నీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ల్యాండ్ మార్క్ మూవీస్ కావడంతో.. ఈ రేస్ పీక్ స్టేజ్ కి చేరిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150.. నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి.. సోగ్గాడే చిన్నినాయన బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగార్జున పొంగల్ కి షెడ్యూల్ చేసిన ఓం నమో వెంకటేశాయ.. సంక్రాంతి రేస్ లో ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. వీటితో పాటు ఈ ఏడాది ఎక్స్ ప్రెస్ రాజా మాదిరిగానే.. శర్వానంద్ మూవీ శతమానం భవతి కూడా సంక్రాంతి పోటీలో నిలుస్తోందని ముందే చెప్పారు.

అయితే.. ఇప్పుడు పొంగల్ రేస్ నుంచి నాగ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9న ఈ భక్తిరస చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారట. మరోవైపు శతమానం భవితిని కూడా వాయిదా వేసుకోవాలని దిల్ రాజు నిర్ణయించాడట. చిరంజీవి-బాలయ్యల చిత్రాలు థియేటర్లలో ఉన్నపుడు చిన్న సినిమాకి స్క్రీన్స్ కేటాయించడం కష్టం అని భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు నాగ్ కూడా స్వచ్ఛందంగా తప్పుకోవడంతో.. ఇఫ్పుడు పొంగల్ రేస్ చిరంజీవి-బాలయ్యల మధ్యే అని తేలిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/