Begin typing your search above and press return to search.
మెగాస్టార్ వదిలిన ఆది సాయికుమార్ 'శశి' టీజర్..!
By: Tupaki Desk | 23 Dec 2020 10:16 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ''శశి''. ఆది కి జోడీగా సురభి నటించిన ఈ చిత్రంలో మరో నాయికగా రాశీ సింగ్ కనిపించనుంది. ఈ చిత్రంతో శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్.పి.వర్మ - సి.రామాంజనేయులు - చింతలపూడి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూర్తైన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవుతుండటంతో 'శశి' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు(డిసెంబర్ 23) హీరో ఆది సాయికుమార్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'శశి' టీజర్ విడుదల చేయబడింది.
'మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తొస్తాయి' అంటూ ఆది చెప్పే డైలాగ్ తో 'శశి' టీజర్ ప్రారంభమైంది. 'ఇష్టమైన పని చేయడానికి.. అవసరం కోసం పని చేయడానికి చాలా తేడా ఉంది' 'అమ్మాయి అందంగా ఉందని ప్రేమించేసి.. తర్వాత ప్రాబ్లమ్స్ లో ఉందని వదిలిస్తే అది లవ్ ఎలా అవుతుంది' వంటి సంభాషణలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్ కూడా ఉన్నట్లు అర్థం అవుతుంది. ఇందులో ఆది ఇప్పటివరకూ కనిపించని సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు సంగీతం సమకూరుస్తుండగా.. అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - వెన్నెల కిశోర్ - తులసి - జయప్రకాష్ - అజయ్ - వైవా హర్ష - సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. మొతం మీద ఈ టీజర్ చూస్తుంటే కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది కి 'శశి' సక్సెస్ అందించేలా కనిపిస్తోంది.