Begin typing your search above and press return to search.

శ‌ర్వానంద్ VS కీర్తి సురేష్...!

By:  Tupaki Desk   |   17 April 2020 1:30 PM GMT
శ‌ర్వానంద్ VS కీర్తి సురేష్...!
X
కరోనా మహమ్మారి దెబ్బకి సినీ ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. సమ్మర్ వస్తే చాలు కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడిపోతుంటాయి. అలాంటిది కరోనా వైరస్ గత కొన్ని వారాలుగా థియేటర్లను మూసి ఉంచేలా చేసింది. లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోయి.. ఇప్పటికే పూర్తయిన సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. దీంతో క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. రేపు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వరుస పెట్టి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఇప్పటికే ఏ చిత్రాలను ముందు బయటకి వదలాలి అనేదాని మీద చిత్ర నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరికొందరు నిర్మాతలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. 'వి' - 'నిశ్శబ్దం' 'ఒరేయ్ బుజ్జిగా' '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఉప్పెన - ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య - లవ్ స్టోరీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏవి ముందుగా రిలీజ్ అవుతాయో తెలియాల్సి ఉంది. వీటితో పాటు కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' - శర్వానంద్ 'శ్రీకారం' సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

అయితే వీటిలో 'మిస్ ఇండియా' 'శ్రీకారం' చిత్రాలు ఒకే డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'శ్రీకారం' చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మరోవైపు కీర్తి సురేష్ నటిస్తున్న 'మిస్ ఇండియా' సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేష్ కోనేరు నిర్మిస్తుండగా నరేంద్రనాథ్ తరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. క‌రోనా దెబ్బ‌కి ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో చెప్ప‌లేము కానీ ఈ రెండు సినిమాలు ఎప్పుడు రిలీజైనా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌టం ఖాయమని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను నిర్మిస్తున్న బ్యానర్లకు ఉన్న ఆభ్లిగేష‌న్లు అలాంటివి మరి. 'మిస్ ఇండియా' ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ కు శ‌ర్వాకు ఎప్ప‌టినుంచో కొంత కోల్డ్ వార్ న‌డుస్తుండ‌టంతో ఎట్టి పరిస్థితుల్లో 'శ్రీకారా'నికి పోటీగా 'మిస్ ఇండియా'ని దింపాలని నిర్మాతలు భావిస్తున్నారట. సాధ్య‌మైనంత త్వ‌రగా ఈ బ్యాన‌ర్ల రెండు సినిమాలు రిలీజ్ చేస్తే త‌ప్ప ఆ త‌రువాత వ‌చ్చే సినిమాల‌కు లైన్ క్లియ‌ర్ అవ్వ‌దు. మ‌రి ఈ బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవ‌రో చూడాలి.