Begin typing your search above and press return to search.

సరైనోడు ఇంత సూపర్ ఫాస్టా?

By:  Tupaki Desk   |   15 Feb 2016 7:19 AM GMT
సరైనోడు ఇంత సూపర్ ఫాస్టా?
X
అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వర్క్ ఫినిష్ అయిపోగా.. ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ ఇచ్చిన సరైనోడు టీం.. ఇప్పుడు టీజర్ రిలీజ్ పోస్టర్ ఇచ్చారు.

ఈ నెల 18న సరైనోడు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పింది సరైనోడు యూనిటీ. ఈ మేరకు ఓ పోస్టర్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ముందు ఈ నెల 28న టీజర్ విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. ఈ మేరకు కొన్ని లీకులు కూడా మీడియాకు అందాయి. కానీ ఎవరూ ఊహించని రీతిలో.. టీజర్ రిలీజ్ డేట్ ని పది రోజుల ముందుకు జరిపి.. ఈ నెల 18న టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు.

టీజర్ పోస్టర్ లో అల్లు అర్జున్ కొత్త లుక్ కేకలు పెట్టిస్తోంది. కండలు పెంచిన సూపర్ ఫిట్ బాడీ.. కమాండో టైప్ లుక్ తో.. బన్నీ అదుర్స్ అనిపిస్తున్నాడు. వెనకాల బాంబులు పేలుతున్నట్లు బ్యాక్ గ్రౌండ్.. ముందు ధీమాగా, స్టైల్ గా నుంచున్న అల్లు అర్జున్.. మాస్ హీరోని ఇంతకంటే గ్రాండ్ గా చూపించడం కష్టం అనిపించేలా పోస్టర్ డిజైన్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్న సరైనోడు.. ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.