Begin typing your search above and press return to search.

సరైనోడి సాంగ్‌ మీద అన్నీ డౌట్లే

By:  Tupaki Desk   |   9 March 2016 5:30 PM GMT
సరైనోడి సాంగ్‌ మీద అన్నీ డౌట్లే
X
అవును. ఎందుకంటే అసలు సరైనోడు సాంగ్‌ లీకైనట్లు ఎక్కడా ఎవ్వరికీ తెలియదు. అంతే కాదు.. ఇప్పటివరకు అభిమానులు కాని.. వ్యతిరేక వర్గాల కాని.. ఎక్కడా ఫేస్‌ బుక్కులోకాని.. ట్విట్టర్‌ లో కాని.. ఇదే ''సరైనోడు'' లీక్డ్ సాంగ్‌ అంటూ ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. కాని ఇంతలోనే అందరికీ షాకిచ్చింది సరైనోడు టీమ్‌.

''సరైనోడు లీక్డ్‌ సాంగ్ ను డౌన్‌లోడ్‌ చేసినా.. చూసినా.. నేరం.. కఠిన చర్యలు తీసుకుంటాం'' అంటూ ఒక ప్రెస్ నోట్‌ ను రిలీజ్ చేసింది టీమ్. అయితే ఈ సాంగ్‌ లీక్‌ అయినట్లు వీరు చెప్పే వరకు ఎవ్వరికీ తెలియదు. అందరికీ తెలియని విషయం గురించి అసలు ఈ రేంజులో ప్రెస్‌ నోట్‌ ఇవ్వడం చూస్తుంటూ.. కావాలనే పబ్లిసిటీ స్టంటులో భాగంగా ఈ ప్రెస్‌ నోట్‌ ను రిలీజ్‌ చేశారా అనే సందేహం వస్తోంది.

ఇంకొక విషయం ఏంటంటే.. ఏదో పాట గురించి రకుల్‌ ప్రీత్‌ ఒక ట్వీట్‌ పెట్టింది. అయితే ఆ ట్వీట్‌ ఎన్టీఆర్‌ పాడిన కన్నడ సాంగ్‌ గురించా.. లేకపోతే సరైనోడు కోసం తమన్‌ కంపోజ్‌ చేసిన సాంగ్‌ గురించా అనేది మాత్రం చాలామంది అర్ధం కాలేదు. ఒకవేళ రకుల్‌ మాట విని.. ఆమె ''మెలోడీ బాగుంది'' అనేసింది కాబట్టి ((జూ.ఎన్టీఆర్‌ పాడింది మెలోడీ కాదుగా)).. సరైనోడు మెలోడీ సాంగ్‌ సూపర్‌ అంటూ కొందరు అభిమానులు ట్వీట్లు వేసి పోస్టులు చేయగానే.. లీక్‌ అయిందనుకొని ఆవేశపడి ఈ ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారా??