Begin typing your search above and press return to search.

మెగా-అక్కినేని పోలిక భయపెడుతోంది

By:  Tupaki Desk   |   26 Jan 2016 5:27 AM GMT
మెగా-అక్కినేని పోలిక భయపెడుతోంది
X
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సరైనోడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. బన్నీ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నిండుగా కండలు పెంచి, చేతిలో పెద్ద కెటిల్ బెల్ తో రచ్చ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే.. ఇలాంటిదే అఖిల్ ఫోటో కంపేర్ చేస్తున్నారు చాలామంది.

అక్కినేని అఖిల్ అరంగేట్ర మూవీ అఖిల్ కి ఇచ్చిన ఫస్ట్ లుక్ కి - సరైనోడుతో చాలామంది పోలిక పెడుతున్నారు. అందులో చేతిలో ఓ బాల్ పట్టుకుని సూర్యుడి వంక చూస్తుంటాడు అఖిల్. సరైనోడులో చేతిలో కెటిల్ బెల్ పట్టుకుని కిందకి సీరియస్ గా చూస్తుంటాడు అల్లు అర్జున్. చేతిలో ఏదో ఒకటి పట్టుకోవడం అన్నదే ఇక్కడ కామన్ పాయింట్. ఇప్పుడు అఖిల్ తో కంపారిజన్ మొదలవడంతో మెగా అభిమానుల్లో కాసింత టెన్షన్ మొదలైంది.

అఖిల్ కు అదిరిపోయే ఆరంభం లభించినా, అది పూర్తి స్థాయిలో డిజాస్టర్ గా మిగిలిన మూవీ. కానీ సరైనోడు అలాకాదు. పైగా సూర్యుడు - శక్తి - జువా అంటూ స్టోరీ అఖిల్ ది. ఇది పూర్తిగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్. ఇలాంటి వాటి జోలికి పోయే అలవాటు బోయపాటికి లేదు. కానీ అఖిల్ డైరెక్టర్ వినాయక్, సరైనోడు దర్శకుడు బోయపాటి శ్రీను.. ఇద్దరూ మాస్ డైరెక్టర్లే. అందుకే ఇలాంటి పోజ్ వచ్చి ఉంటుంది అంటున్నారు మెగా అభిమానులు. అంతే తప్ప.. ఫస్ట్ లుక్ పై అసలు పోలిక పెట్టడం కూడా కరెక్ట్ కాదన్నది వాళ్ల ఫీలింగ్.