Begin typing your search above and press return to search.

సరైనోడు.. అంతంతమాత్రమే ఫస్ట్ డే వసూళ్లు

By:  Tupaki Desk   |   23 April 2016 7:31 AM GMT
సరైనోడు.. అంతంతమాత్రమే ఫస్ట్ డే వసూళ్లు
X
సమ్మర్ సీజన్ ఫుల్లుగా హాలీడేస్ మధ్యలో ఓ మూవీ వస్తే.. అది పూర్తిగా మాస్ రచ్చతో నిండిపోయి ఉంటే.. ఏ రేంజ్ కలెక్షన్స్ ఉండాలి? ముఖ్యంగా బీ - సీ సెంటర్లలో అయితే థియేటర్స్ నిండిపోయి కళకళలాడాలి. కానీ సరైనోడు మాత్రం అంచనాలను అందుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో - అల్లు అర్జున్ నటించిన ఊర బాస్ మూవీ అంటే.. మెగాభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ మామూలుగా లేవు. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశ్చర్యకరంగా తక్కువ కలెక్షన్లే వచ్చాయి. అటు తెలంగాణ - ఇటు ఆంధ్ర సీడెడ్ - మరోవైపు యూఎస్ ఏ.. ఎక్కడా కూడా ఆశించిన స్థాయికి తగ్గట్లుగా వసూళ్లు కనిపించలేదు. ఈస్ట్ లో 1.02 కోట్లు - వెస్ట్ లో 1.03 కోట్లు - కృష్ణా జిల్లాలో 56 లక్షలు మాత్రమే వచ్చాయి. రీసెంట్ గా పవన్ ఇచ్చిన ఫ్లాప్ సర్దార్ గబ్బర్ సింగ్ కు కృష్ణాలో తొలి రోజు వసూళ్లు 1.51 కోట్లు కావడం గమనించాలి. ఇక సీడెడ్ లో అయితే తొలిరోజు 1.92 కోట్లు వసూలయ్యాయి. నైజాం తో కలిపితే.. మొత్తం 10 కోట్ల రూపాయలను తొలిరోజున రాబట్టగలిగాడు సరైనోడు.

అల్లు అర్జున్ సినిమాల స్థాయితో పోల్చితే ఇది ఎక్కువగానే కనిపించచ్చు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఇతర టాప్ హీరోలతో పోల్చితే, మాస్ సినిమాల విషయంలో బన్నీ వీక్నెస్ ని బయటపెట్టిందని అంటున్నారు. బోయపాటి లాంటి డైరెక్టర్ తీసిన చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తే కేవలం 10 కోట్లే ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యకరమే.