Begin typing your search above and press return to search.

డివైడ్ టాక్.. కలెక్షన్లు కుమ్మేస్తున్నాడు

By:  Tupaki Desk   |   24 April 2016 6:16 AM GMT
డివైడ్ టాక్.. కలెక్షన్లు కుమ్మేస్తున్నాడు
X
మొన్న శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సరైనోడు’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. తొలి షో నుంచే దీనికి డివైడ్ టాక్ మొదలైంది. బి.. సి.. సెంటర్లలో సినిమాకు తిరుగులేదన్న అభిప్రాయం వినిపించినా.. క్లాస్ ఆడియన్స్ సినిమా చూసి పెదవి విరిచారు. క్రిటిక్స్ కూడా సినిమా మీద విమర్శలు గుప్పించారు.

ఐతే టాక్ ఎలా ఉన్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం ‘సరైనోడు’ దూసుకెళ్తోంది. బి-సి సెంటర్లలో మాత్రమే కాదు.. మల్టీప్లెక్సుల్లో సైతం ఇప్పటిదాకా కలెక్షన్లకు ఢోకా లేదు. వీకెండ్ అంతా దాదాపుగా హౌస్ ఫుల్సే పడ్డాయి. ఈ రోజు బుకింగ్స్ చూసినా.. పెద్దగా ఖాళీలు కనిపించట్లేదు. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్ల షేర్ మార్కును ఈజీగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

మాస్ సినిమాల్ని పెద్దగా ఆదరించని అమెరికాలో సైతం ‘సరైనోడు’ అంచనాల్ని మించి పెర్ఫామ్ చేస్తోంది. ప్రిమియర్లతో కలిపి ఆ సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే యుఎస్ లో బయ్యర్ నష్టాల పాలవుతాడేమో అనుకున్నారంతా. కానీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఐతే ‘సరైనోడు’ అసలు సత్తా ఏంటన్నది సోమవారానికే తెలుస్తుంది. డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు సహజంగా సోమవారం కలెక్షన్లలో పెద్ద డ్రాప్ కనిపిస్తుంది. అలా కాకుండా ఓ మోస్తరు డ్రాప్ తో సరిపెడితే.. ‘సరైనోడు’ బాక్సాఫీస్ జర్నీ సేఫ్ అయిపోయినట్లే. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.54 కోట్లు కలెక్ట్ చేస్తేనే హిట్ కేటగిరీలోకి చేరినట్లు. మరి బన్నీ ఎక్కడిదాకా ప్రయాణిస్తాడో చూడాలి.