Begin typing your search above and press return to search.

మహేష్ వచ్చేవరకూ ఎవరూ తగ్గట్లేదు

By:  Tupaki Desk   |   10 May 2016 10:30 PM GMT
మహేష్ వచ్చేవరకూ ఎవరూ తగ్గట్లేదు
X
టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ బాగా రంజుగా ఉంది. సరైనోడు ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా.. థియేటర్ల సంఖ్య తగ్గినా ఇప్పటికీ జోరు మాత్రం తగ్గలేదు. ఊర మాస్ అంటూ బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇక సుప్రీం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు సాయిధరం తేజ్. ఫుల్ లెంగ్త్ ఎంటర్టెయినర్ కావడంతో.. ఈ సినిమాని కూడా హిట్ కోటాలోకి చేర్చేశారు జనాలు. కోలీవుడ్ స్టార్ హీరో నటించిన 24 అయితే.. జనాలను థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గురి చేసి మరీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టేసింది.

సరైనోడు - సుప్రీం, 24.. మూడు సినిమాలు వేరువేరు జోనర్స్ కావడంతో.. వేటి ప్రేక్షకులు ఆ సినిమాని విపరీతంగా చూసేస్తున్నారు. మరోవైపు అన్నిటికీ ప్రచారం టాప్ గేర్ లో సాగుతోంది. సుప్రీం, 24 హిట్ అవడంతో ఇక సరైనోడు జోరు పూర్తి అనుకున్నా.. ఇంకా థియేటర్లలో అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం చేసేస్తున్నాడు బన్నీ. రిలీజ్ కి ముందు నుంచే సుప్రీమ్ యూనిట్ జిల్లాలను కవర్ చేయడం స్టార్ట్ చేసేసింది.

ఇక 24 ప్రచారం కోసం.. సమంత బోలెడంత కష్టపడుతోంది. అడిగినోళ్లు అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ.. 24 తెలుగు వెర్షన్ ప్రచారాన్ని భుజాన వేసేసుకుంది. తమిళ్ వెర్షన్ కి మించిన హిట్ చేసిన టాలీవుడ్ ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు.. రేపో మాపో సూర్య కూడా రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది. చూస్తుంటే.. బ్రహ్మోత్సవం వచ్చే వరకూ.. అంటే మరో 10 రోజుల పాటు వీళ్లంతా ప్రచారం విషయంలో ఏ మాత్రం తగ్గకూడదని డిసైడ్ అయ్యారనిపిస్తోంది కదూ.