Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాటతో మొబైల్స్ బ్లాస్ట్‌ అవ్వబోతున్నాయి

By:  Tupaki Desk   |   24 Jan 2022 7:36 AM GMT
సర్కారు వారి పాటతో మొబైల్స్ బ్లాస్ట్‌ అవ్వబోతున్నాయి
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో పాటల కోసం కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈమద్య కాలంలో థమన్‌ మాటలు మారు మ్రోగుతున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన అల వైకుంఠపురంలో పాటలు బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్నాయి. ఇప్పుడు ఏమాత్రం తగ్గకుండా సర్కారు వారి పాట సినిమా పాటలు కూడా అదే స్థాయిలో ఉంటాయి అనే నమ్మకంతో ఉన్నారు.

భీమ్లా నాయక్ సినిమా తో పాటు సర్కారు వారి పాట సినిమాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న థమన్ రెండు సినిమాలకు కూడా ది బెస్ట్‌ ట్యూన్స్ ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

భీమ్లా నాయక్ నుండి వచ్చిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ప్రముఖ గాయిని గీతా మాధురి మరియు థమన్ లు ఇన్ స్టా గ్రామ్ లైవ్‌ లో అభిమానులతో ముచ్చటించారు.

ఈ సందర్బంగా వారు భీమ్లా నాయక్ నుండి మరో మంచి పాట రాబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన మాస్ బీట్స్ తరహా కాకుండా ఒక విభిన్నమైన కూల్‌ మ్యూజికల్‌ సాంగ్‌ ను భీమ్లా నాయక్‌ నుండి ఇవ్వబోతున్నట్లుగా థమన్‌ ప్రకటించాడు. ఇప్పటికే భీమ్లా నాయక్‌ నుండి వచ్చిన పాటలు సినిమా స్థాయిని పెంచేశాయి. ఇక ఆ పాట సినిమా కు మరింత ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయేమో చూడాలి.
వచ్చే నెలలో విడుదల కాబోతున్న భీమ్లా నాయక్‌ కు చెందిన ఆ పాట ఎప్పుడు విడుదల చేసే విషయమై థమన్‌ క్లారిటీ ఇవ్వలేదు.

ఇక థమన్‌ సర్కారు వారి పాటకు సంబంధించిన అప్ డేట్ ను కూడా ఇచ్చాడు. సినిమాలోని పాటలు ఖచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తాయని ప్రకటించాడు.

ఇదే సమయంలో ఆయన సర్కారు వారి పాట సినిమాలోని ఒక పాట ఫ్యాన్స్‌ ట్యూన్స్‌ తో మొబైల్స్ బ్లాస్ట్‌ అవ్వడం ఖాయం అంటూ థమన్‌ పేర్కొన్నాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా పాటలు సినిమా స్థాయిని మరింతగా పెంచే అవకాశం ఉందని థమన్ మాటల ద్వారా తెలుస్తోంది.

సినిమా ను ఏప్రిల్‌ లో విడుదల చేయాలని మొదట భావించారు. కాని షూటింగ్‌ పూర్తి కాకపోవడం వల్ల విడుదల సాధ్యం అయ్యేలా లేదు. అందుకే ఇప్పుడు సర్కారు వారి పాటను సమ్మర్ చివర్లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సమ్మర్ లో సినిమా విడుదల చేయాలంటే వచ్చే నెల నుండి ఒక్కో పాట చొప్పున సర్కారు వారి పాట టీమ్‌ విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మహా శివరాత్రి సందర్బంగా సర్కారు వారి పాట సినిమా మొదటి పాటను విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.