Begin typing your search above and press return to search.

సర్కారువారి సెకెండ్ సాంగ్ లోడింగ్

By:  Tupaki Desk   |   6 March 2022 4:30 PM GMT
సర్కారువారి సెకెండ్ సాంగ్ లోడింగ్
X
మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా తమన్ తిరుగులేని స్థాయిలో ఉన్నాడిప్పుడు. అతను సంగీతం అందిస్తే సినిమా సూపర్‌‌ డూపర్ హిట్ అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. ముఖ్యంగా అతని మ్యూజిక్ హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తూ ఉండటంతో పనిగట్టుకుని బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకుంటున్నారు కొందరు దర్శక నిర్మాతలు.

ప్రేక్షకులు కూడా తమన్‌ మ్యూజిక్ చేస్తున్నాడనగానే తమ ఫేవరేట్ హీరోల సినిమాలపై అంచనాలను పెంచేసుకుంటున్నారు.

అయితే తమన్‌ని అందరూ ఇష్టపడటానికి మరో కారణం కూడా ఉంది. అతను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుంటాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల నుంచి అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తుండేవారు ఫ్యాన్స్. సినిమా రెడీ అయితేనో, ఏ పండక్కో ఒక అప్‌డేట్‌ని వదిలితేనో తప్ప ఆ సినిమా గురించిన వివరాలు తెలిసేవి కావు. కానీ దీన్ని తమన్ బ్రేక్ చేశాడు.

తాను పని చేసే సినిమాల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్‌ని వదులుతూనే ఉంటాడు. ఒక్కోసారి దాచిపెట్టాల్సిన విషయాల్ని లీక్ చేసేస్తుంటాడనుకోండి. అది టీమ్‌ని ఇబ్బంది పెడుతుందేమో కానీ సినీ లవర్స్‌ని మాత్రం చాలా సంతోషపెడుతోంది.

ఇప్పుడు సర్కారువారి పాట గురించి ఓ అప్‌డేట్ ఇచ్చాడు తమన్. యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కళావతి సాంగ్‌ విషయంలో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన తమన్.. సెకెండ్ సాంగ్ లోడ్ అవుతున్న సంగతిని రివీల్ చేశాడు. ‘మా కళావతిని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్స్.

ఇవాళ్టి నుంచి రెండో పాట మీద వర్క్ స్టార్ట్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ఈ పాట కూడా సాలిడ్‌గా ఉండబోతోందని ఊరించాడు కూడా. అతి త్వరలోనే ఈ సాంగ్ రిలీజయ్యే చాన్స్ ఉంది. మొత్తానికి తమన్ పుణ్యమా అని ఏ సినిమా వర్క్‌ ఏ స్టేజ్‌లో ఉందో తెలుస్తోంది జనాలకి.