Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట' న్యూ షెడ్యూల్‌ అప్డేట్‌

By:  Tupaki Desk   |   31 Jan 2022 12:41 PM GMT
సర్కారు వారి పాట న్యూ షెడ్యూల్‌ అప్డేట్‌
X
మహేష్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉన్నా కరోనా బ్యాక్ టు బ్యాక్‌ వేవ్స్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాను ఏప్రిల్‌ 1వ తారీకు కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా వస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విడుదల విషయం పక్కన పెడితే అసలు ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ముగుస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమా షూటింగ్‌ పునః ప్రారంభం కాబోతుంది. మహేష్‌ బాబుకు ఆపరేషన్‌.. కరోనా థర్డ్‌ వేవ్.. మహేష్ బాబు కు కరోనా పాజిటివ్‌ మరియు రమేష్ బాబు మృతి వంటి కారణాల వల్ల గత కొన్ని నెలలుగా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తుంది.

ఎట్టకేలకు ఫిబ్రవరి రెండవ వారం నుండి సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్‌ లో మహేష్ బాబు జాయిన్ అవ్వబోతున్నట్లుగా అధికారికంగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు మరియు ఇతర యూనిట్‌ సభ్యుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు లేకుండా కొన్ని సన్నివేశాలను దర్శకుడు పరశురామ్ చిత్రీకరించాడు. సినిమా ను మరీ ఆలస్యం చేయకుండా విడుదల చేయడం కోసం ఫిబ్రవరి లేదా మార్చి లో సినిమా షూటింగ్‌ ను ముగించాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే కరోనా ఫిబ్రవరి లో కాస్త ఎక్కువగా ఉంటుందనే వార్తలు వస్తున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌ షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మహేష్‌ బాబు కు జోడీగా ఈ సినిమా లో కీర్తి సురేష్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన పాటల కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 1వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. కాని అదే రోజున ఆచార్య ను విడుదల చేయబోతున్నట్లుగా మెగా కాంపౌండ్ నుండి ప్రకటన వచ్చింది. కనుక సర్కారు వారి పాట సినిమా రిలీజ్ రీ షెడ్యూల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌ లోనే మరో డేట్ కు లేదా మే లో సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సర్కారు వారి పాట సినిమా సరికొత్త విడుదల తేదీ ని ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14న సర్కారు వారి పాట నుండి మొదటి సింగిల్ రాబోతుంది. ఆ సమయంలో ఏమైనా కొత్త విడుదల తేదీ వస్తుందేమో చూడాలి.