Begin typing your search above and press return to search.

ఆచార్య లా కాకుండా 'సర్కారు వారి పాట' ఆ విషయంలో సక్సెస్‌

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 PM GMT
ఆచార్య లా కాకుండా సర్కారు వారి పాట ఆ విషయంలో సక్సెస్‌
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 12వ తారీకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కించాడని మహేష్ బాబు లుక్ మరియు ట్రైలర్‌ ను చూస్తుంటే అనిపిస్తుందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాల నడుమ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఆచార్య సినిమా కు ఉన్న అంచనాలను కనీసం ట్రైలర్‌ కూడా అందుకోలేక పోయింది.

ట్రైలర్‌ తో ఆచార్య ఆసక్తిని రేకెత్తించలేక పోయాడు... సినిమా స్థాయిని ఆచార్య ట్రైలర్‌ పెంచడంలో విఫలం అయ్యింది. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌ ఆ సెంటిమెంట్‌ ను బ్రేక్ చేసింది.

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. ట్రైలర్‌ లో మహేష్‌ బాబు బాడీ లాంగ్వేజ్.. డైలాగ్స్.. యాక్షన్ సన్నివేశాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమా పై అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఉన్నాయి. పోకిరి మరియు దూకుడు సినిమాల స్థాయిలో మహేష్‌ బాబు ఫ్యాన్స్ ను ఈ సినిమా ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నట్లుగా మహేష్ బాబు అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

సినిమా బజ్‌ క్రియేట్‌ అవ్వడానికి టీజర్ మరియు ట్రైలర్‌ కీలక పాత్ర పోషించాలి. అప్పుడే సినిమా ఫలితం పాజిటివ్‌ గా వస్తుంది. ఒక వేళ ఫలితం కాస్త అటు ఇటు అయినా కూడా వసూళ్ల విషయంలో కాస్త గౌరవప్రదమైన నెంబర్స్ నమోదు అవుతాయి. ఆచార్య సినిమా ట్రైలర్‌ నిరాశ పర్చడంతో సినిమాకు విడుదల ముందు బజ్‌ క్రియేట్‌ అవ్వలేదు. సినిమా ఫలితం తారుమారు అవ్వడంతో చాలా తక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి.

సర్కారు వారి పాట సినిమా ట్రైలర్‌ విషయంలో సక్సెస్‌ అయ్యింది. మహేష్ బాబు లుక్ తో పాటు ప్రతి ఒక్క విషయంలో కూడా దర్శకుడు తీసుకున్న శ్రద్ద కనిపిస్తుంది. దాంతో ప్రేక్షకులకు సినిమా పై అంచనాలు ఆసక్తి పెంచడంలో సక్సెస్ అయ్యింది. ఆచార్య విఫలం అయిన ట్రైలర్ విషయంలో సర్కారు వారి పాట సక్సెస్ అయ్యింది. కనుక సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.