Begin typing your search above and press return to search.

స‌ర్కార్ వారి 105 షాట్లు మెంట‌ల్ మాస్ స్వాగ్

By:  Tupaki Desk   |   1 May 2022 5:19 PM IST
స‌ర్కార్ వారి 105 షాట్లు మెంట‌ల్ మాస్ స్వాగ్
X
మ‌హేష్ న‌టించిన `స‌ర్కార్ వారి పాట` ప్ర‌మోష‌న్స్ ప‌రంగా వెన‌క‌బ‌డింద‌న్న టాక్ ఉంది. కేవ‌లం రెండు వారాల స‌మ‌యం మిగిలి ఉండ‌గా ఇంకా సినిమా కీల‌క న‌టీన‌టుల ప్ర‌చారం లేదేమిటీ? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. మ‌హేష్ ప్యారిస్ టూర్ ముగించి తిరిగి ప్ర‌మోష‌న్స్ లో జాయినవుతార‌ని చిత్ర‌బృందం చెబుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ కంటే టెక్నీషియ‌న్లే స‌ర్కార్ వారిని బాగా ప్ర‌మోట్ చేసారు. ఇక‌ థ‌మ‌న్ ఇన్ స్టా ట్విట్ట‌ర్ లో యాక్టివ్ గా ఉండి ప్ర‌మోట్ చేస్తున్నాడు. వ‌రుసగా టెక్నీషియ‌న్ల ఇంట‌ర్వ్యూలు వైర‌ల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మ‌హేష్ ప్ర‌మోష‌న్ చేసినా చేయ‌కున్నా అత‌డి హ‌వాకి ఎదురు లేదు. అయినా ప్ర‌మోష‌న్స్ లో స్పీడ్ పెంచాల్సిన ఈ త‌రుణంలో సూప‌ర్ స్టార్స్ MENTAL MASS SWAG అంటూ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రైల‌ర్ లో సూప‌ర్ స్టార్ కి చెందిన 105 మాస్ షాట్స్ ని చూపించ‌నున్నామ‌ని .. రేపు సాయంత్రం 4.05 నిమిషాల‌కు ట్రీటుంటుంద‌ని ప్ర‌క‌టించారు.

#SVP ట్రైల‌ర్ షాట్స్ మంట‌లు పెట్టేయ‌డం గ్యారెంటీ అన్న‌ హింట్ కూడా ఇచ్చారు. మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర్కార్ వారి పాట విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం మ‌హేష్ అభిమానులు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు.