Begin typing your search above and press return to search.

స‌ర్కార్ వారి టికెట్ పెంపులో ఏపీ- టీఎస్ పోటాపోటీ

By:  Tupaki Desk   |   9 May 2022 9:00 PM IST
స‌ర్కార్ వారి టికెట్ పెంపులో ఏపీ- టీఎస్ పోటాపోటీ
X
సూపర్ స్టార్ మహేష్ -కీర్తి సురేష్ జంట‌గా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట మే 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురామ్ పెట్ల ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కాగా.... 14 రీల్స్ ప్లస్ - GMB ఎంటర్ టైన్ మెంట్‌- మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు. ఇప్ప‌టికే పాట‌ల‌తో బోలెడంత ప్ర‌చారం క‌లిసొచ్చింది.

ఇక ఈ సినిమా నిర్మాత‌ల‌కు తీపి క‌బురు చెబుతూ ఏపీ - తెలంగాణ ప్ర‌భుత్వాలు టికెట్ రేటును పెంచాయి. ఈ చిత్రానికి మ‌ద్ధ‌తుగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. 30 నుండి 50 రూపాయల వరకు టికెట్ ధరల ను పెంచేందుకు అనుమతి ఇవ్వడం విశేషం. 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లు .. మల్టీప్లెక్స్ లలో ఈ ధరలు అనుమ‌తిస్తారు. 7 రోజుల పాటు రోజుకు 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం `సర్కారు వారి పాట` సినిమా టిక్కెట్ ధరలను పెంచడానికి అనుమతించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమా టిక్కెట్ల ధరలను పెంచేందుకు అనుమతివ్వ‌డంతో మ‌హేష్ అభిమానుల్లో కోలాహాలం క‌నిపిస్తోంది. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో అదనంగా వ‌సూళ్ల‌కు ఆస్కారం క‌ల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులకు సాధారణ టిక్కెట్ ధరలపై రూ.45 పెంపు ఉంటుంది. పది రోజుల తర్వాత పాత ధరలనే కొనసాగించాలని ఏపీ ప్ర‌భుత్వం కోరింది. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం కంటే ముందే ఏపీ ప్ర‌భుత్వం ఈసారి టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం ఆస‌క్తిక‌రం. తెలంగాణ‌లో 354 మ‌ల్టీప్లెక్సులు 212 సింగిల్ స్క్రీన్లు ఏపీలో 236 మ‌ల్టీప్లెక్సులు 205 సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. వీట‌న్నిటా తొలివారం టికెట్ పెంపు అమ‌ల్లో ఉంటుంది.

ఇంత‌కుముందే టిక్కెట్ ధరల పెంపును సులభతరం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్కారువారి పాట యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి తాజాగా ధ‌న్య‌వాదాలు తెలిపింది. సూపర్ స్టార్ మహేష్ బాబు- కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ఈ సినిమాకి దర్శకత్వం పరశురామ్ నిర్వహించారు. అత్యంత భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.