Begin typing your search above and press return to search.

'స‌ర్కారు వారి పాట' టీమ్ ఆ రేట్ల‌కే ఫిక్స్ అవుతుందా?

By:  Tupaki Desk   |   3 May 2022 9:00 AM IST
స‌ర్కారు వారి పాట టీమ్ ఆ రేట్ల‌కే ఫిక్స్ అవుతుందా?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన భారీ చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈమూవీ మే 12న అత్యంత భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టించింది బ్యాకింగ్ వ్యవ‌స్థ‌పై సెటైరిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` త‌రువాత మ‌హేష్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్ల‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

సినిమా రిలీజ్ కి మ‌రో ప‌ది రోజులే వుండ‌టంతో మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని ప్రారంభించేశారు. సోమ‌వారం భ్ర‌మ‌రాంబ థియేట‌ర్లో ఈ మూవీ ట్రైల‌ర్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. `పోకిరి` వైబ్స్ క‌నిపిస్తున్నాయ‌ని మొద‌టి నుంచి హీరో మ‌హేష్ చెబుతూ వ‌స్తున్నారు. ట్రైల‌ర్ ఆ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. `నా ప్రేమ‌ని దొంగిలించ‌గ‌ల‌వ్‌.. నా స్నేహాన్ని దొంగిలించ‌గ‌ల‌వ్ .. కానీ నువ్వు నా డ‌బ్బుని మాత్రం దొంగిలించ‌లేవ్‌... అమ్మాయిల‌ని అప్పు ఇచ్చే వాళ్ల‌ని పాంప‌ర్ చేయాలిరా ..ర‌ణ్ గా హ్యాండీల్ చేయ‌కూడ‌దు. నేను విన్నాను.. నేను వున్నాను... దీనెమ్మ మెయింటైన్ చేయ‌లేక దూల తీరిపోతోంది..దిస్ ఈజ్ మ‌హేష్ ..రిపోర్టింగ్ ఫ్ర‌మ్ చేప‌లపూడి బీచ్ స‌ర్‌` అంటూ మ‌హేష్ చెప్పిన డైలాగ్ లు పోకిరి సినిమాని గుర్తు చేస్తున్నాయి.

ఆ రేంజ్ కి ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో మ‌హేష్ ఓ రేంజ్ లో మ‌ళ్లీ త‌న పాత స్టైల్ ని గుర్తు చేస్తూ వీర విహారం చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. `పోకిరి` ట్రైల‌ర్ రిలీజ్ టైమ్ లో ఎలాంటి వైబ్ కినిపించిందో అదే స్థాయి వైబ్ `స‌ర్కారు వారి పాట‌` ట్రైల‌ర్ లో క‌నిపించ‌డం అభిమానుల్ని ఆనందింప‌జేస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని నైజాం లో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. సినిమా క్రేజ్ ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న వైబ్ ని ముందే ప‌సిగ‌ట్టిన ఆయ‌న ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఎగ్జిబిట‌ర్ల‌లో ముచ్చ‌టించిన దిల్ రాజు చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌ని లాక్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇటీవ‌ల విడుద‌లైన `ఆచార్య‌` కు భారీ స్థాయిలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటుని ఉభ‌య తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిగించాయి. అయితే సినిమా ఫ‌లితం మాత్రం మ‌రోలా వుండంట‌తో ఇప్ప‌డు `స‌ర్కారు వారి పాట‌` టికెట్ రేట్ల పెంపుపై చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌డ్జెట్ లెక్క‌ల ప్ర‌కారం టికెట్ రేట్లు పెంచుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న ఏపీ ఈసినిమా విష‌యంలో సానుకూలంగా స్పందిస్తుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం భారీ చిత్రాల‌కు టికెట్ రేట్లు పెంచుకునే విధంగా వెసులు బాటు క‌ల్పిస్తున్న నేప‌థ్యంలో `స‌ర్కారు వారి పాట‌`కు ఆ వెసులు బాటు క‌ల్పించ‌క‌పోవ‌డ‌మే క‌రెక్ట్ అనే వాద‌న వినిపిస్తోంది.

కార‌ణం అభిమానుల‌తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కులు కూడా భారీ స్థాయిలో టికెట్ రేటు పెట్టి ప్రాంతీయ సినిమాల‌ని చూడాల‌ని ఆస‌క్తిని చూపించ‌డం లేదట‌. దీంతో ఎక్కువ మంది ఎక్కు రోజులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని, భారీ మొత్తం పెట్టి సినిమాలు చూసేందుకు సాధార‌ణ జ‌నం ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని అందుకే `స‌ర్కారు వారి పాట‌` కు రేట్లు పెంచ‌క‌పోవ‌డ‌మే ప్ల‌స్ అవుతుంద‌ని చెబుతున్నార‌ట‌. కానీ నైజాం ఏరియాలో భారీ స్థాయిలో రిలీజ్ కు స‌న్నాహాలు చేసుకుంటున్న దిల్ రాజు ఊరుకుంటాడా? ఖ‌చ్చితంగా రేట్లు పెంచాల్సిందే అంటాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.