Begin typing your search above and press return to search.

స‌ర్కారు వారి టిక్కెట్ నైజాంలో ఎంతంటే?

By:  Tupaki Desk   |   1 May 2022 3:00 PM IST
స‌ర్కారు వారి టిక్కెట్ నైజాంలో ఎంతంటే?
X
తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వాలు ఇటీవల జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ భారీ బడ్జెట్ తో సినిమాలు తీసిన నిర్మాతలు ప్రభుత్వాలను కోరితే ప్రత్యేకంగా పరిగణించి కొన్ని రోజులు సాధారణ టికెట్ ధరల కంటే అధికంగా అమ్మడానికి అనుమతిస్తున్నాయి. తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇటీవల బడా ఇటీవల విడుదలైన RRR సినిమా ఈ జీవోని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది. నైజాం ఏరియాలో `బీస్ట్` -'కేజీఎఫ్ 2` లాంటి డబ్బింగ్ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇలా టిక్కెట్ ధ‌ర‌లు పెర‌గ‌డంతోనే వారం రోజుల్లోనే ఈ సినిమాలు రెండు 1000 కోట్ల క్ల‌బ్ లో చేరాయి. తెలుగు రాష్ర్టాల వ‌సూళ్లే మొత్తం గ్రాస్ వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషించాయ‌ని చెప్పొచ్చు.

ఇక మే 12న సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `సర్కారు వారి పాట` భారీ అంచ‌నాల మ‌ధ్య‌ రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. రిలీజ్ కి ఇంకా ప‌ది రోజులే స‌మ‌యం ఉంది. దీంతో టిక్కెట్ ధ‌ర‌లు షురూ చేస్తున్న‌ట్లు తెలుస్తోది. తెలంగాణ లో ఇప్ప‌టికే టిక్కెట్ ధ‌ర‌లు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన మొద‌టి రోజు మ‌ల్టీప్లెక్స్ ల్లో 354 రూలు..సింగిల్ స్ర్కీన్ లో 210 రూలుగా నిర్ధారించిన‌ట్లు తెలుస్తుంది.

ఇక రెండ‌వ రోజు అదే మ‌ల్టీ ప్లెక్స్ లో 295 రూలు.. సింగ‌ల్ స్ర్కీన్ కి 175 రూలుగా టిక్కెట్ కి ఛార్జ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా పంపిణీ హ‌క్కుల్ని తెలంగాణ‌లో దిల్ రాజు ద‌క్కించుకున్నారు. ఈనేప‌థ్యంలో ఎగ్జిబిట‌ర్స్ అంతా ఈ ధ‌ర‌లు అనుస‌రించే టిక్కెట్ అమ్మ‌కాలు జ‌ర‌గాల‌ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. కాగా `స‌ర్కారు వారి పాట` 60 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మాణం జరిగింది.

అయితే ఈ టిక్కెట్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయ‌ని మ‌రోవైపు విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తోంది. స్టార్ హీరోల సినిమాల‌కి..భారీ బ‌డ్జెట్ సినిమాల‌కి టిక్కెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు ప్ర‌భుత్వాలు క‌ల్పించినా ఆ రెండింటికీ మధ్య వ్య‌త్యాసం పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. అయితే తెలంగాణ‌తో పొలిస్తే ఏపీలో టిక్కెట్ ధ‌ర‌లు అందుబాటులోనే ఉన్నాయ‌ని తెలుస్తోంది.