Begin typing your search above and press return to search.

'స‌ర్కారు వారి పాట' థియేట్రిక‌ల్ బ్లాస్ట్ రెడీ

By:  Tupaki Desk   |   28 April 2022 11:30 AM GMT
స‌ర్కారు వారి పాట థియేట్రిక‌ల్ బ్లాస్ట్ రెడీ
X
రెండున్న‌రేళ్ల విరామం త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా తరువాత మ‌హేష్ నుంచి మ‌రో సినిమా రాలేదు. దీంతో ఆయ‌న సినిమా కోసం ప్రేక్ష‌కులు, అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం 'స‌ర్కారు వారి పాట‌'. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీకి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ పర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ రిలీజ్ అన్ని చిత్రాల త‌ర‌హాలోనే రెండు ద‌ఫాలుగా మారి మొత్తానికి మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ముందు ఈ మూవీని జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆల‌స్యం కావ‌డం.. అదే స‌మాయంలో పార్ ఇండియా మూవీస్ రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్ వారం వ్య‌వ‌వ‌ధిలో రిలీజ్ కు రెడీ అయిపోవ‌డంతో 'స‌ర్కారు వారి పాట‌'ని వాయిదా వేశారు. ఫైన‌ల్ గా మే 12న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌బించింది. అంతే కాకుండా త‌మ‌న్ సంగీతం అందించగా మూడు లిరిక‌ల్ వీడియోల‌ని విడుద‌ల చేశారు. ఇందులో 'క‌ళావతి..' నెట్టింట దుమ్ములేపుతోంది. 'పెన్నీ..' స‌ర్కారు వారి పాట టైటిల్ సాంగ్ వీడియోలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇందులో 'పెన్నీ' సాంగ్ ప్ర‌మోష‌న‌ల్ వీడియోలో మ‌హేష్ ముద్దుల కూతురు సితార డ్యాన్స్ తో అద‌ర‌గొట్టేసింది.

ఇదిలా వుంటే సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఫ్యాన్స్ ఈ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ట్రైల‌ర్ రిలీజ్ చేస్తే చూడాల‌ని, సినిమా ఏ రేంజ్ లో బాక్సులు బ‌ద్ద‌లు కొట్ట‌బోతోందో ట్రైల‌ర్ తో ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు.

ఎట్ట‌కేల‌కు వారి ఎదురుచూపుల‌కు తెర‌దించుతూ చిత్ర బృందం ఫైన‌ల్ గా గురువారం సాయంత్రం గుడ్ న్యూస్ చెప్పేసింది. 'స‌ర్కారు వారి పాట‌' ట్రైల‌ర్ ని మే 2న విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టిస్తూ తాజాగా కొత్త పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది.

ఇటీవ‌లే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఫైన‌ల్ క‌ట్ రెడీ చేసిన ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ప్రామిస్ చేస్తున్నా ట్రైల‌ర్ బిగ్ బ్లాస్ట్ గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చారు. 2 నిమిషాల నిడివితో ట్రైల‌ర్ సాగుతుంద‌ని, ఫ్యాన్స్ కి ఇదొక విజువ‌ల్ ఫీస్ట్ అని హింట్ ఇచ్చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ఈ విశేషాల‌కు వెల్ల‌డించారు. డైరెక్ట‌ర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే 'స‌ర్కారు వారి పాట‌' ష్యూర్ షాట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అని తెలుస్తోంద‌ని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.