Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్: ఇఫ్ యు మిస్ ది ఇంట్రెస్ట్ యు విల్ గెట్ డేట్!

By:  Tupaki Desk   |   9 Aug 2021 2:40 AM GMT
టీజ‌ర్ టాక్: ఇఫ్ యు మిస్ ది ఇంట్రెస్ట్ యు విల్ గెట్ డేట్!
X
మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `స‌ర్కార్ వారి పాట‌`. పరశురామ్ ద‌ర్శ‌కుడు. మైత్రి మూవీ మేకర్స్-14 రీల్స్ ప్లస్ - జి. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు స‌ర‌స‌న‌ కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌గా.. వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రాఫ‌ర్. 25 జనవరి 2021 న సినిమా ప్రారంభమైంది. 13 జనవరి 2022 న సంక్రాంతి కానుక‌గా విడుదల కానుంది.

నేడు మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా స‌ర్కార్ వారి పాట టీజ‌ర్ రిలీజైంది. ఈ టీజ‌ర్ ప్ర‌ధానంగా మూవీ టోన్ ఏమిటో ఆవిష్క‌రించింది. ఇఫ్ యు మిస్ ది ఇంట్రెస్ట్ యు విల్ గెట్ డేట్!! అంటూ విల‌న్ల‌ను సూప‌ర్ స్టార్ ఇర‌గ‌దీస్తున్న తీరు చూస్తుంటే ఇందులో భారీ యాక్ష‌న్ కి స్కోప్ ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవైపు మ‌హేష్ లోని మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తూనే దుబాయ్ లోని విలాస‌వంత‌మైన భ‌వంతుల్లో ఆఫీస్ ని హ్యాండిల్ చేస్తున్న‌ స్మార్ట్ గ‌య్ గానూ మ‌హేష్ క్లాస్ లుక్ తో క‌నిపిస్తున్నారు. ఇక పూజ‌లు పున‌స్కారాలు ధూపం అంటూ ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉండే యువ‌తిగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌నిపించ‌నుంది. కీర్తితో మ‌హేష్ రొమాన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంది. ఇక ఫ‌న్ ఎలిమెంట్ కోసం వెన్నెల కిషోర్ ఎలానూ ఉన్నారు. మొత్తానికి టీజ‌ర్ సింపుల్ గా ప్లెజెంట్ గా అల‌రించింది. ఇక ఈ మూవీలో మ‌హేష్ లోని మాసిజానికి సింబ‌ల్ గా మెడ‌పై కాయిన్ టాట్టూ క‌నిపిస్తోంది. అత‌డు మొండి బ‌కాయిలు వ‌సూలు చేసేందుకు కార్పొరెట్ గూండాల‌ను చిత‌క్కొడుతూ మాస్ కి స్ప‌ష‌ల్ ట్రీట్ ఇవ్వ‌నున్నారని అర్థ‌మ‌వుతోంది.

స‌ర్కార్ వారి పాట త‌ర్వాత మ‌హేష్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. త‌దుప‌రి ఎస్.ఎస్.రాజ‌మౌళితోనూ భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించాల్సి ఉంది. అల్లు రామాయ‌ణంలో శ్రీ‌రాముడి పాత్ర కోసం మ‌హేష్ ని సంప్ర‌దించార‌ని క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే.