Begin typing your search above and press return to search.

బార్సిలోనాలో `స‌ర్కారు వారి పాట‌`

By:  Tupaki Desk   |   18 Oct 2021 8:32 AM IST
బార్సిలోనాలో `స‌ర్కారు వారి పాట‌`
X
సూపర్‌ స్టార్ మ‌హేష్ బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత చేస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ పెట్లు డైరెక్ట్ చేస్తున్నారు. ఆయ‌న‌కిది గోల్డెన్ ఆపార్చునిటీ అని చెప్పొచ్చు. మ‌హేష్‌ని డైరెక్ట్ చేయాల‌న్న డ్రీమ్‌ తో ఈ స‌బ్జెక్ట్‌ ని రెడీ చేసుకున్న ప‌ర‌శురామ్ అనూహ్యంగా త‌న డ్రీమ్ ‌ని నిజం చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌... 14 ప్ల‌స్ రీల్స్.. జీఎంబీ ఎంట‌ర్ ‌టైన్‌ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

కీర్తి సురేష్ హీరోయిన్‌ గా న‌టిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఫ‌స్ట్ లుక్ స్టిల్స్ .. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఈ సినిమా అవుట్‌ పుట్ చూసుకున్న మ‌హేష్ `పోకిరి` వైబ్స్ క‌నిపిస్తున్నాయ‌ని చెప్ప‌డం.. సినిమా ఆ స్థాయిలో వుంటుంద‌ని మ‌హేష్ గ‌ట్టి న‌మ్మ‌కంగా చెప్ప‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి.

చాలా రోజుల త‌రువాత మ‌హేష్ మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ కావ‌డం..బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ లోపాల నేప‌థ్యంలో సెటైరిక‌ల్ క‌థాంశం నేప‌థ్యంలో రూపొందుతున్న మూవీ కావ‌డంతో స‌హ‌జంగానే అ మూవీపై అంచ‌నాలు పెరిగాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ ఆ అంచ‌నాల‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ల‌ని వ‌రుస‌గా అందిస్తున్న త‌మ‌న్ తాజాగా మ‌రో అప్‌డేట్‌ని అందించారు.

షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ ‌ని చిత్ర బృందం స్పేయిన్‌ లోని బార్సిలోనాలో ప్లాన్ చేసింద‌ట‌. ఊప‌ర్ ఎన‌ర్టిటిక్ టీమ్ అక్క‌డికి చేరుకుంద‌ని ప్రొడ్యూస‌ర్ ర‌విశంక‌ర్‌.. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ‌ల‌తో కలిసి వున్న ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్న త‌మ‌న్ పాట‌ల్లో సూప‌ర్ ‌స్టార్ ఎన‌ర్జీకి సాక్షంగా నిల‌వ‌డానికి చాలా ఎక్సైటెడ్ ‌గా వున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.