Begin typing your search above and press return to search.

సర్కారు వారి ఫస్ట్‌ పాట అప్డేట్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:19 AM GMT
సర్కారు వారి ఫస్ట్‌ పాట అప్డేట్ వచ్చేసింది
X
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన మొదటి పాటను విడుదల చేసేందుకు రెడీ అంటూ థమన్ ప్రకటించాడు. నేడు రిపబ్లిక్ డే సందర్బంగా సర్కారు వారి పాట సినిమా మొదటి పాట అప్డేట్‌ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతా ఆశించినట్లుగానే నేడు సర్కారు వారి పాట సినిమా నుండి మొదటి పాట ఎప్పుడు రాబోతుంది అనే విషయంలో థమన్‌ క్లారిటీ ఇచ్చాడు. ఫిబ్రవరి 14న మొదటి పాట విడుదల చేయబోతున్నట్లుగా థమన్‌ ప్రకటించాడు.

థమన్ ఈమద్య కాలంలో తన అన్ని సినిమాలకు కూడా పాటలు ఇరగదీస్తున్నాడు. అఖండ సినిమా లోని జై బాలయ్య పాట మరియు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ రెండు నెలలు అయినా కూడా రచ్చ చేస్తూనే ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్ పాటలతో థమన్ గత ఏడాది లో తెగ హడావుడి చేశాడు. ఇక ఈ ఏడాది థమన్ సర్కారు వారి పాట సినిమా తో తన మ్యూజిక్‌ ఎంటర్‌ టైన్ మెంట్‌ ను మొదలు పెట్టబోతున్నాడు. సర్కారు వారి పాట నుండి మొదటి పాట కోసం కొన్ని నెలలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల అయ్యి ఉంటే ఇప్పటికే పాటలన్నీ వచ్చి ఉండేవి. కాని సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేదు. దాంతో పాటలు కూడా ఆలస్యం అవుతున్నాయి.

ఏప్రిల్‌ లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు ఆ తేదీకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఏప్రిల్‌ లో కాకున్నా సమ్మర్‌ లోనే సినిమాను విడుదల చేస్తామంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో సర్కారు వారి పాట షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంటుంది. దాంతో సినిమా విడుదల తేదీని కూడా మరోసారి ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఒక్కో పాట చొప్పున సర్కారు వారి పాట నుండి పాటలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. తద్వారా మహేష్ బాబు అభిమానులను సంగీత ప్రపంచంలో ఉర్రూతలూగించేందుకు గాను థమన్‌ సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మహేష్‌ బాబు ఈ సినిమా లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. దాంతో అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయి. థమన్‌ ఒక భారీ బ్లాక్‌ బస్టర్ మ్యూజిక్ ఆల్బం ను మహేష్‌ బాబు ఫ్యాన్స్ కు ఇస్తానంటూ చాలా నమ్మకంగా చెబుతున్నాడు. ఫ్యాన్స్‌ మొబైల్‌ ఫోన్స్ సర్కారు వారి పాట ట్యూన్స్ తో దద్దరిలే సమయం వచ్చేసిందంటూ థమన్ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే.