Begin typing your search above and press return to search.

ది బెస్ట్‌ లొకేషన్ లో సర్కారు వారి డ్యూయెట్‌

By:  Tupaki Desk   |   20 Oct 2021 11:01 AM IST
ది బెస్ట్‌ లొకేషన్ లో సర్కారు వారి డ్యూయెట్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. గత రెండు వారాలుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అక్కడే చిత్రీకరణ జరుపుతున్నారు. మొదట టాకీ పార్ట్‌ షూట్ చేశారు. అందులో భాగంగా ఒక ఫైట్ సన్నివేశాన్ని కూడా అక్కడ షూట్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మరియు కీర్తి సురేష్‌ లపై అక్కడే ఒక రొమాంటిక్ డ్యూయెట్‌ ను షూట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత అందమైన లొకేషన్స్ లో ఒక్కటి అయిన బార్సిలోనా లో ఈ డ్యూయెట్‌ ను చిత్రీకరణ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పాట చిత్రీకరణతో స్పెయిన్ షెడ్యూల్‌ దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెలలో ముగించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మూడవ షెడ్యూల్‌ తో సినిమా కొన్ని క్లైమాక్స్‌ సన్నివేశాలు ఒక పాట తప్ప మిగిలిన మొత్తం పూర్తి అయినట్లే అంటున్నారు. బ్యాలన్స్ వర్క్‌ ను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్‌ లో షూట్‌ చేయబోతున్నారు. ఈ సినిమాను నవంబర్‌ లో ముగించి అదే నవంబర్‌ లో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టే ఉద్దేశ్యంతో మహేష్‌ బాబు ఉన్నాడట. సర్కారు వారి పాట సినిమాను వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. గత ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు వచ్చిన విషయం తెల్సిందే.

సర్కారు వారి పాట చిత్రీకరణ కోసం ఇప్పటికే మహేష్‌ బాబు దుబాయి వెళ్లాడు.. ఇప్పుడు స్పెయిన్ లో చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని మెజార్టీ పార్ట్‌ సన్నివేశాలు విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించడంతో కథ ఏంటీ.. అసలు దర్శకుడు ఇంతటి భారీ సినిమాను ఎలా మెనేజ్ చేస్తున్నాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్‌ వెంటనే మహేష్‌ బాబుతో ఈ సినిమాను తీస్తున్నాడు అంటే ఎలా ఊహించుకోవాలో కూడా అర్థం కావడం లేదు అంటూ కొందరు అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా మహేష్‌ బాబు కు పరశురామ్ తప్పకుండా ఒక మంచి విజయాన్ని ఇస్తాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ మరియు మహేష్‌ లు మొదటి సారి జంటగా నటిస్తున్నారు. వీరి కాంబో పై కూడా అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.