Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కు పూనకలు తెప్పించేలా 'సర్కారు వారి పాట' ఇంటర్వెల్ బ్లాక్..?

By:  Tupaki Desk   |   2 Oct 2021 4:02 PM IST
ఫ్యాన్స్ కు పూనకలు తెప్పించేలా సర్కారు వారి పాట ఇంటర్వెల్ బ్లాక్..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. దర్శకుడు పరశురామ్ పెట్లా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు ఉండేలా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో చేసే సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరాశురామ్.. మాస్ కి తగ్గట్టుగానే సీన్స్ డిజైన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.ఇటీవల విడుదలైన 'సర్కారు వారి పాట' బ్లాస్టర్ లో ఇది శాంపిల్ గా చూపించాడు. మహేష్ లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారని అర్థం అయింది.

పరశురామ్ గత రెండు చిత్రాలు 'గీత గోవిందం' 'శ్రీరాస్తు శుభమస్తు' చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు. తొలి సినిమా 'ఆంజనేయులు' లో కాస్త మాస్ ని కూడా టచ్ చేశారు. ఇప్పుడు వింటేజ్ మహేష్ బాబు ని చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' ఇంటర్వెల్ కోసం డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలబోతోందని టాక్ వినిపిస్తోంది. సింహాచలంలోని ప్రసిద్ధమైన శ్రీ వరహాలక్ష్మీ నరసింహ దేవస్థానంలో ఇంటర్వెల్ ని ప్లాన్ చేశారట.

ఇంటర్వెల్ లో మహేష్ బాబు మెయిన్ విలన్ అయిన సముద్రఖనికి వరహావతారంలో కనిపించేలా సీన్ ని డిజైన్ చేశారట. గతంలో 'యువరాజు' చిత్రంలో ఓ పాటలో కృష్ణుడిగా కనిపించిన మహేష్.. ఆ తర్వాత మరే చిత్రంలోనూ పౌరాణిక గెటప్ లో కనిపించలేదు. ఇప్పుడు పరశురామ్ కాస్త డిఫరెంట్ గా ఈ సీన్ లో మహేష్ ని చూపించబోతున్నారట. ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటుందని టాక్ నడుస్తోంది. మరి అది తెరపై ఎలా ఉంటుందో చూడాలి.

ఇకపోతే 'సర్కారు వారి పాట' సినిమా 'పోకిరి' రేంజ్ లో ఉండబోతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మాస్ తో పాటుగా మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారు. భారతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థ - బ్యాంకుల కుంభకోణం - ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టిన ఆర్థిక నేరగాళ్లు వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించబోతున్నారట. బ్యాంక్ రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన ప్రముఖుల దగ్గర నుంచి.. ఆర్థిక నేరాలకు పాల్పడే కింది స్థాయి వ్యక్తుల వరకు అందరినీ ఈ సినిమాతో టార్గెట్ చేయబోతున్నారట. మహేష్ నటిస్తున్న ఈ 27వ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుంటుందో చూడాలి.

'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ ఇప్పటికే 60-70 శాతం కంప్లీట్ అయింది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్ కు పయనమయ్యారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' కోసం వాయిదా వేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే 'పోకిరి' రిలీజ్ డేట్ కి ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.

GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ - మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.