Begin typing your search above and press return to search.

#స‌ర్కార్ వారి పాట‌.. బ్యాంకింగ్ నేర‌గాళ్ల‌పై బీజీఎం జాగ్ర‌త్త‌!

By:  Tupaki Desk   |   30 Oct 2020 5:30 AM GMT
#స‌ర్కార్ వారి పాట‌.. బ్యాంకింగ్ నేర‌గాళ్ల‌పై బీజీఎం జాగ్ర‌త్త‌!
X
`అల వైకుంఠ‌పురములో` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం వెన‌క త‌మ‌న్ క్రియేటివిటీ పాత్ర ఎంతైనా వుంది. త‌న‌దైన సుస్వ‌రాల‌తో ఈ మూవీని త‌న చార్ట్ లో ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాడు. ఆ ఒక్క క్లిక్ తోనే అత‌నికి భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం త‌మ‌న్ సంగీతం అందిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` నుంచి అంతే పెద్ద‌గా ఆశిస్తున్నారు అభిమానులు. ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. కీర్తిసురేష్ ఇందులో నాయిక‌.

సూప‌ర్ హిట్ కాంబో క‌ల‌యిక‌లో రానున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ని ఎత్తి చూపుతూ వైట్ కాల‌ర్ నేర‌గాళ్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీని ప్ర‌త్యేకంగా చూస్తున్నారు. దీనికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవ‌లే త‌మ‌న్ త‌న ప‌ని మొద‌లుపెట్టాడు. ఇందుకు సంబంధించి త‌మ‌న్ సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేశాడు కూడా. రీసెంట్ గా కంపోజింగ్ మొద‌లైంద‌ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ల‌వ్‌లీ సిట్యువేష‌న్స్ ఇచ్చాడ‌ని సూప‌ర్ స్టార్ కోసం పాట‌లు కంపోజ్ చేయ‌డం ఆనందంగా వుందని ట్వీట్ చేశాడు.
అన్న‌ట్టు బ్యాంకింగ్ నేర‌గాళ్ల‌పై సినిమా.. బీజీఎం విష‌యంలో క్యూరియాసిటీ ఇంపార్టెంట్. మ‌రి బీజీఎంలు రీరికార్డింగుల్లో థ‌మ‌న్ స‌త్తా గురించి చెప్పాల్సిన ప‌నే లేదు.