Begin typing your search above and press return to search.

కరోనా టెర్రర్ : మహేష్ బాబు సడెన్ డెసిషన్!

By:  Tupaki Desk   |   31 Dec 2020 10:34 AM IST
కరోనా టెర్రర్ : మహేష్ బాబు సడెన్ డెసిషన్!
X
తెలుగు సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టించడంతో అందరూ అప్రమత్తం అవుతున్నారు. మెగా ఫ్యామిలీని కొవిడ్-19 టచ్ చేయడంతో.. మిగిలిన హీరోలు సెట్ బ్యాక్ అవుతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు సడెన్ డెసిషన్ తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో షూటింగ్ కొనసాగించడం సేఫ్ కాదని భావించిన మహేష్.. ‘సర్కారు వారి పాట’ షూట్ ను పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం.

కొవిడ్-19 తీవ్రత కొనసాగుతుండగానే.. కొత్తగా కరోనా స్ట్రెయిన్ దూసుకొచ్చింది. తీవ్రంగా ప్రభావం చూపుతున్న ఈ సెకండ్ కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతల అవుతున్నాయి. దీంతో ఫారెన్ కంట్రీస్ లో షూటింగ్ వాయిదా వేసుకుంటున్నారు టాలీవుడ్ మేకర్స్ అండ్ యాక్టర్స్.

వాస్తవానికి.. ‘సర్కారు వారి పాట’ షెడ్యూల్ అమెరికాలో నవంబర్లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. వీసా ప్రాబ్లం క్లియర్ కాకపోవడంతో వాయిదావేసుకున్నారు. హైదరాబాద్ లోనే షూటింగ్ కంటిన్యూ చేశారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న షూట్ కూడా ఆలస్యం అవుతోంది.

ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ ను జనవరి మొదటి వారంలో ప్రారంభించడానికి దర్శకనిర్మాతలు ఏర్పాట్లు చేశారు. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో వాయిదా వేయాలని మహేష్ కోరారట. కొత్త షెడ్యూల్ సంక్రాంతి పండుగ తర్వాత ప్లాన్ చేయాలని మేకర్స్ ను కోరినట్లు సమాచారం. దీంతో మూవీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ నిర్మిస్తున్న ఈ మూవీలో కీర్తి శెట్టి కథానాయికగా నటిస్తోంది.