Begin typing your search above and press return to search.

స‌ర్కార్ వారు ముందు ఈ లీకులు ఆపాలి!

By:  Tupaki Desk   |   7 Feb 2021 8:00 AM GMT
స‌ర్కార్ వారు ముందు ఈ లీకులు ఆపాలి!
X
`అత్తారింటికి దారేది` చిత్రం స‌గం ఆన్ లైన్ లో లీకైపోయినా.. ఏమీ చేయ‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత చాలా సినిమాల వీడియోలు లీక‌య్యాయి. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత కీల‌క యాక్ష‌న్ సీన్స్ లీక‌య్యాయి అప్ప‌ట్లో. దేవ‌ర‌కొండ టాక్సీవాలా పూర్తి సినిమా లీకైపోవ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే అయ్యింది. ఇక భారీ చిత్రాలు ఏవైనా ఇంపార్టెంట్ ఫోటోలు.. కొన్ని సీన్ల‌కు సంబంధించిన వీడియోలు లీకైపోతుండ‌డం చూస్తున్న‌దే.

ఆర్.ఆర్.ఆర్ - వ‌కీల్ సాబ్.. పుష్ప .. స‌ర్కార్ వారి పాట‌.. ఇవేవీ అతీతం కాదు. ఈ భారీ సినిమాల లీకుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌లేక చేతులెత్తేశారు. ఇప్పుడు మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట‌కు సంబంధించిన కీల‌క‌మైన ఫైట్ సీక్వెన్స్ ఫోటోలు సోష‌ల్ మీడియాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఓవైపు చిత్ర‌బృందం నుంచి కొన్ని అధికారిక ఫోటోలు వ‌చ్చేస్తున్నా.. మ‌రోవైపు ఈ లీకులు ఇబ్బందిక‌రంగానే మారాయి.

మైత్రి సంస్థ దీనిపై కాస్త సీరియ‌స్ గా దృష్టి సారిస్తుందేమో చూడాలి. ఇక ఈ బ్యాన‌ర్ నుంచి ఉప్పెన రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ఆ ప్ర‌మోష‌న్స్ లో నిర్మాత‌లు బిజీ బిజీ. స‌ర్కార్ వారి లీకుల‌కు టీమ్ స‌భ్యులు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి. ప్ర‌స్తుతం మ‌హేష్ తో పాటు థ‌మ‌న్ దుబాయ్ లో ఆన్ లొకేష‌న్ ఉన్నారు. మైత్రి- 14 రీల్స్ ప్ల‌స్ తో పాటు మ‌హేష్ ఈ చిత్రానికి ఒక నిర్మాత అన్న సంగ‌తి విధిత‌మే.