Begin typing your search above and press return to search.

దళపతి సరసన మూడోసారి సర్కార్ బ్యూటీ..?

By:  Tupaki Desk   |   27 May 2021 4:30 PM GMT
దళపతి సరసన మూడోసారి సర్కార్ బ్యూటీ..?
X
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్.. మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తో ఈ ఏడాది ప్రారంభించాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషించిన మాస్టర్ మూవీ విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే మాస్టర్ అనంతరం కాస్త విరామం తీసుకొని దళపతి విజయ్ ఇటీవలే తన 65వ సినిమా ప్రారంభించాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఆ భారీ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దళపతి తదుపరి సినిమాలు కూడా ఇండస్ట్రీ వర్గాలలో.. సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

తాజాగా దళపతి విజయ్ టాలీవుడ్ దర్శకుడుతో స్ట్రెయిట్ తెలుగు సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే విజయ్ తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశంతోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ఆలోచనలో ఉన్నాడట. అందుకే టాలీవుడ్ డైరెక్టర్ కథను ఓకే చేసినట్లు టాక్ నడుస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం.. ఇటీవలే డైరెక్టర్ వంశీ పైడిపల్లి విజయ్ మధ్య సంప్రదింపులు జరిగాయని.. వంశీ ఓ స్క్రిప్ట్ కూడా వినిపించాడనేది విదితమే. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ సానుకూలంగా స్పందించి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలనీ కోరినట్లు తెలుస్తుంది.

నిజానికి దాదాపు ఏడాదిన్నర కాలంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఏ హీరోతో కూడా సినిమా ప్రకటించలేదు. 2019లో విడుదలైన మహర్షి మూవీ తర్వాత వంశీ నుండి ఏ సినిమా ప్రకటన కూడా రాలేదు. మరి మొత్తానికి టాలీవుడ్ విడిచి తమిళ స్టార్ హీరోని బాగానే లైన్ లో పెట్టాడంటూ ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయ్యాక హీరో మరోసారి వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం విజయ్ కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు కంప్లీట్ చేసాక ఈ సినిమా పట్టాలెక్కనుందేమో చూడాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను బైలింగ్వేల్ మూవీగా రూపొందించే ప్లాన్ చేస్తున్నారని.. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా మహానటి కీర్తిసురేష్ ను ఓకే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇదివరకు విజయ్ - కీర్తి కాంబోలో భైరవ - సర్కార్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కీర్తి తమిళంతో పాటు తెలుగులో మంచి క్రేజ్ ఉండటం కారణంగా ఆమెను ఓకే చేసే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్ వర్గాలలో టాక్.