Begin typing your search above and press return to search.

మరోసారి 'ఛలో దుబాయ్' అనబోతున్న సర్కారు వారు!

By:  Tupaki Desk   |   9 March 2021 6:00 AM IST
మరోసారి ఛలో దుబాయ్ అనబోతున్న సర్కారు వారు!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే దుబాయ్ లో 'సర్కారు వారి పాట' మూవీ భారీ షెడ్యూల్ పూర్తిచేసి ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దుబాయ్ లో దాదాపు నెలరోజుల పాటు భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది సర్కార్ టీమ్. త్వరలోనే మరో భారీ షెడ్యూల్ షూట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. అయితే మొన్నటివరకు సర్కారు వారి తదుపరి షెడ్యూల్ గోవాలో ఉండబోతుందని.. అక్కడే ఓ అందమైన పాటను షూట్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో షూట్ చేయాల్సి ఉందని మేకర్స్ భావించారు.

కానీ ఇప్పుడు మళ్లీ ప్రణాళిక మార్చినట్లు తెలుస్తుంది. తదుపరి షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే ఫిక్స్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మార్చ్ 22 నుండి సర్కారు వారి బృందం దాదాపు మరో నెలపాటు షూటింగ్ జరుపనున్నట్లు తెలుస్తుంది. దుబాయ్‌లో షూట్ పూర్తయిన తర్వాత మిగిలిన షూట్ హైదరాబాద్, గోవాలో జరుగుతుంది. ఈ సినిమాలో మొదటిసారి కీర్తిసురేష్ మహేష్ తో రొమాన్స్ చేయనుంది. ఆగష్టు వరకు షూటింగ్ పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ మూడోసారి మహేష్ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.