Begin typing your search above and press return to search.

'సర్కారు వారి పాట'కు కూడా సరిలేరు నీకెవ్వరు ఫార్ములానేనా?

By:  Tupaki Desk   |   26 Sept 2020 11:30 AM IST
సర్కారు వారి పాటకు కూడా సరిలేరు నీకెవ్వరు ఫార్ములానేనా?
X
మహేష్‌ బాబు మహర్షి సినిమా వరకు కూడా ఒక్కో సినిమాకు కనీసం ఏడాది సమయం తీసుకునే వారు. సినిమాల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు షూటింగ్‌ నెలల తరబడి చేసేవారు. కాని సరిలేరు నీకెవ్వరు సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేశారు. మహేష్‌ బాబు సినీ కెరీర్‌ లో అతి తక్కువ సమయంలోనే పూర్తి అయిన సినిమాగా ఆ సినిమా నిలుస్తుంది అంటూ అభిమానులు అంటున్నారు. ఆ సినిమా ఫార్ములానే సర్కారు వారి పాటకు అమలు చేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడు.

కరోనా కారణంగా చాలా ఆలస్యం అవుతున్న సర్కారు వారి పాటను వచ్చే నవంబర్‌ లేదా డిసెంబర్‌ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని దర్శకుడు పరశురామ్‌ కు మహేష్‌ బాబు సూచించాడట. ఏకధాటిగా షూటింగ్‌ ను చేసి వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు సినిమా షూటింగ్‌ ను ముగించాలని నిర్మాతలు కూడా భావిస్తున్నారట. తక్కువ సమయంలో సినిమా పూర్తి అవ్వడం వల్ల చాలా బడ్జెట్‌ సేవ్‌ అవ్వడంతో పాటు రిస్క్‌ తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనుసరించిన ఈ ఫార్ములా చాలా బాగా వర్కౌట్‌ అవ్వడం వల్ల మళ్లీ అదే విధంగా పరశురామ్‌ సర్కారు వారి పాటను తక్కువ సమయంలో పూర్తి చేస్తాడని తెలుస్తోంది.